కొంతమంది సీనియర్ కళాకారుల స్వార్థ రాగద్వేషాలు తెలుగు నాటకరంగాన్ని దెబ్బతీశాయి. పరిషత్ నిర్వాహకుల చేతుల్లోంచి నియంత్రణ జారిపోవడం, రంగస్థల అభివృద్ధికి పెద్ద అవరోధం. తమ రంగస్థల ప్రయాణాన్ని విశ్లేషించుకుని, నాటక అభివృద్ధికి నిజ మైన కృషి చేసే పరిషత్‌లకు బాధ్యతలు అప్పగించేందుకు సీనియర్ కళాకారులు, నిర్వాహకులు, న్యాయనిర్ణేతలు ముందుకు రావాలి. నాటక వేదికలను స్వార్థానికి కాకుండా, కళాభివృద్ధికి ఉపయోగించాలి.
– గోపరాజు విజయ్,
సినీ, రంగస్థల నటుడు, తెనాలి