పరిషత్‌లను నాటకరంగానికి ఊపిరి అంటారు, కానీ అవి కేవలం ఉనికిని చాటుతాయిగానీ, అభివృద్ధికి దోహదపడడం లేదు. నాటక వికాసానికి ప్రధానంగా ప్రేక్షకాదరణ అవసరం. కొన్ని పరిషత్‌లు తమకిష్టమైన వ్యక్తులు, సమాజాలకు ఇచ్చే ప్రాధాన్యత మిగతావారికి ఇవ్వడం లేదు. నూతనత్వం, న్యాయ నిర్ణేతల్లో లోపించిన పారదర్శకత తదితర లోపాలతో యువత ఈరంగంపై ఆసక్తి చూపడం లేదు. పోటీ నాటికల స్థానంలో నాటకోత్సవాలను నిర్వహిస్తూ, ప్రభుత్వ ప్రోత్సాహాన్ని నిర్మాణాత్మకంగా తీర్చిదిద్దగలిగితే పూర్వవైభవం తథ్యం.
– అద్దేపల్లి భరత్‌కుమార్,
నాటక రచయిత, హైదరాబాద్