కూటమి ప్రభుత్వం స్కూళ్లలో ఉన్న రంగస్థల వేదికల వద్ద ఎటువంటి నాటక ప్రదర్శనలు ఇవ్వకూడదని జీఓ ఇవ్వడం బాధాకరం. దీనిని వెనక్కి తీసుకోవాలి. అంపశయ్యపై ఉన్న నాటక రంగాన్ని పరిషత్‌లే దాతల సాయంతో పునరుజ్జీవానికి కృషి చేస్తున్నాయి. ప్రభుత్వం సినీ పరిశ్రమపై చూపే ప్రేమ నాటకరంగంపై చూపడంలేదు. రంగస్థలాన్ని విస్మరిస్తోంది. పట్టణాలు, మండల కేంద్రాల్లో ఓపెన్ థియేటర్లను నిర్మించే దిశగా చర్యలు తీసుకోవాలి. కళాకారులకు అక్రిడిడేషన్‌తో పాటు పెన్షన్, ఇళ్లస్థలాలు మంజూరు చేసి భరోసా కల్పించాలి.
– డాక్టర్ ముత్తవరపు సురేష్‌బాబు,
వేదిక, పుచ్చలపల్లి సుందరయ్య కళాపరిషత్ అధ్యక్షుడు, యడ్లపాడు