చందోలు(కర్లపాలెం): చందోలు శ్రీ బగళాముఖి అమ్మవారిని ఆదివారం ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గుణరంజన్ సతీమణి విజిత, కుమారుడు గిరీష్, కుమార్తె గ్రీష్మ, రైల్వే కోర్టు జడ్జి పి.రమాదేవి, నూజివీడు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి వెంకటేశ్వరరావు దర్శించుకున్నారు. వీరికి ఆలయ కార్యనిర్వహణాధికారి నరసింహమూర్తి, అర్చకులు స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ విశేషాలను వివరించారు. అనంతరం వారు కానుకలు సమర్పించుకున్నారు. అమ్మవారి చిత్రపటాలను, ప్రసాదాలను వారికి ఈవో అందజేశారు.
ఎద్దు వాగుపై బిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన
రాజుపాలెం: మండలంలోని మొక్కపాడు గ్రామ సమీపాన ఎద్దువాగుపై బ్రిడ్జి నిర్మాణానికి ఆదివారం రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, శాసన సభ్యులు కన్నా లక్ష్మీనారాయణ శంకుస్థాపన చేసి, శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. బిడ్జిని రూ.5.66 కోట్లతో నిర్మిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దారు దుర్గేష్‌రావు, ఎంపీడీవో జీవీ సత్యనారాయణ, కూటమి నాయకులు పాల్గొన్నారు.
రోడ్డు ప్రమాదంలో 10 మందికి తీవ్ర గాయాలు
సత్తెనపల్లి: రోడ్డు ప్రమాదంలో పది మందికి తీవ్ర గాయాలైన ఘటన పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం దూళిపాళ్ల లయోలా ఇంజనీరింగ్ కళాశాల సమీపంలో ఆదివారం రాత్రి జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. గుంటూరు సమీపంలోని నల్లపాడుకు చెందిన 25 మంది నాగార్జునసాగర్ వెళ్లి మొక్కు తీర్చుకొని తిరిగి వస్తుండగా, వారు ప్రయాణిస్తున్న వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. వాహనంలో 25 మంది ప్రయాణిస్తుండగా, 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం వారిని సత్తెనపల్లి ప్రాంతీయ వైద్యశాలకు తరలించారు. సత్తెనపల్లి రూరల్ పోలీసులు ఘటనా స్థలాన్ని సందర్శించి వివరాలు సేకరిస్తున్నారు.
వయోజన విద్య, రాత్రి బడి పరిశీలన
తాడికొండ: తాడికొండ మండలంలో నిర్వహిస్తున్న వయోజన విద్య, రాత్రి బడి కేంద్రాలను ఆదివారం ఢిల్లీ నుంచి వచ్చిన కేంద్ర బృందం సభ్యులు పరిశీలించారు. మండలంలోని నాలుగు కేంద్రాలను పరిశీలించిన వారు వయోజన విద్య, రాత్రి బడి కార్యక్రమం జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. మండలంలో 50 అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా 510 మంది చదువుకుంటున్నారని అధికారులు తెలిపారు. ఉల్లాస్ వయోజన విద్య ద్వారా డాక్రా సంఘాల మహిళలు నేర్చుకున్న అక్షరాలు, విద్యపై పరీక్ష నిర్వహించి, వాటిని కేంద్ర బృందం సభ్యులు పరిశీలించి హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర అడల్ట్ ఎడ్యుకేషన్ బ్యూరో కన్సల్టెంట్ అధికారి జగన్‌మోహన్‌రావు, సభ్యులు ఓంకారం, శిరీష, దాసరి వెంకటస్వామి ఎంపీడీవో కె. సమతావాణి, ఏపీఎం సాంబశివరావు, సిబ్బంది పాల్గొన్నారు.
బగళాముఖి సేవలోన్యాయమూర్తులు
బగళాముఖి సేవలోన్యాయమూర్తులు
బగళాముఖి సేవలోన్యాయమూర్తులు