
కార్యకర్తలందరికీ వైఎస్సార్ సీపీ అండ
పిడుగురాళ్ల: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ అండగా ఉంటుందని గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి అన్నారు. పట్టణంలోని పల్నాడు హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న అంజినీపురం గ్రామానికి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బక్కిరెడ్డిని ఆయన పరామర్శించి ధైర్యం చెప్పారు. టీడీపీ మూకలు దాడి చేయడం దుర్మార్గమని, ఇటువంటి కవ్వింపు చర్యలకు పాల్పడితే భవిష్యత్‌లో తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించారు. అధికారం శాశ్వతం కాదని, గెలుపు, ఓటములు సహజమని పేర్కొ న్నారు. రేపు అధికారంలోకి వచ్చేది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీనేనని, అది గుర్తుపెట్టుకొని టీడీపీ నాయకులు వ్యవహరించాలని తెలిపారు. తమ పార్టీ నాయకులు, కార్యకర్తల జోలికి వస్తే ఊరుకునేది లేదని ఈ సందర్భంగా హెచ్చరించారు. ఆయన వెంట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వైద్యులు విభాగం అధికార ప్రతినిధి డాక్టర్ చింతలపూడి అశోక్‌కుమార్, పట్టణ, మండల కనీనర్లు చింతా వెంకట రామారావు, చల్లా పిచ్చిరెడ్డి, వైఎస్సార్ సీపీ నాయకులు అల్లు పిచ్చిరెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు వీరభద్రుని రామిరెడ్డి, కత్తెరపు రామ్‌గోపాల్‌రెడ్డి, ఎస్సీ సెల్ కన్వీనర్ కాలే మాణిక్యరావు, పట్టణ యూత్ అధ్యక్షులు మందా సుధీర్, వైస్ ఎంపీపీ సాతులూరి బాబు, మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ చింతా సుబ్బారెడ్డి, వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.
మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి