
ముస్లింలను వంచించిన కూటమి ప్రభుత్వం
నాదెండ్ల: ముస్లింలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న వక్ఫ్ బోర్డు చట్ట సవరణకు కూటమి ప్రభుత్వం మద్దతునివ్వడం అన్యాయమని, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీరని ద్రోహం చేశారని ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధికార ప్రతినిధి షేక్ బాజీ ఆవేదన వ్యక్తం చేశారు. ముస్లిం ఓటు బ్యాంకుతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు మాయమాటలు చెప్పి మోసం చేసిందని విమర్శించారు. వక్ఫ్ బిల్లుకు ముఖ్యమంత్రులు చంద్రబాబునాయుడు, నితీష్‌కుమార్ మద్దతు తెలిపారని కేంద్ర మంత్రి కిరణ్ రిజుజు బహిరంగ ప్రకటన చేయడం ముస్లింలపై వారికున్న కపట ప్రేమను తేటతెల్లం చేసిందని తెలిపారు. ముస్లింలకు అండగా నిలుస్తామన్న మాటకు కట్టుబడి ఉంటే వక్ఫ్ బిల్లును వ్యతిరేకిస్తూ ముఖ్యమంత్రి బహిరంగ ప్రకటన చేయాలని షేక్ బాజీ డిమాండ్ చేశారు. వక్ఫ్ బిల్లుపై చిత్తశుద్ధి ప్రకటించకపోతే భవిష్యత్తులో ముస్లింల ఆగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుందని హెచ్చరించారు.
ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్
రాష్ట్ర అధికార ప్రతినిధి షేక్ బాజీ
వక్ఫ్ బిల్లుకు మద్దతు అన్యాయం