మాచర్ల: పొలం రిజిస్ట్రేషన్‌కు ఇవ్వాల్సిన డబ్బు తీసుకుని ఉడాయించిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరచగా న్యాయమూర్తి 14 రోజు రిమాండ్ విధించారు. స్థానిక పోలీస్ స్టేషన్‌లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ ప్రభాకరరావు వివరాలు వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లా, తుక్కుగూడ గ్రామానికి చెందినా బండెల నరసింహా రెడ్డికి దుర్గి మండలంలోని, ముటుకూరు గ్రామ శివారులో 6.88 ఎకరాల పొలం ఉంది. దీన్ని విక్రయించేందుకు ప్రయత్నిస్తుండగా మాచర్ల టౌన్‌కు చెందిన చింతా శ్రీనివాసరావు పరిచయం అయ్యాడు. 2022లో పొలం అమ్మకం విషయంలో చిత్తూరు జిల్లాకు చెందిన మైలా మల్లేష్ యాదవ్, సదరు మధ్యవర్తిగా ఉన్నాడు. నరసింహారెడ్డి తన పొలాన్ని దుర్గి మండలానికి చెందిన మాదాసు వెంకటేశ్వర్లుకు రూ.70.50 లక్షలకు విక్రయించేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. దీనికి అడ్వాన్సుగా రూ.45 లక్షలు మాదాసు వెంకటేశ్వర్లు, మల్లేష్ యాదవ్‌కి ఇచ్చారు. అందులో రూ.15 లక్షలు తన వద్ద పెట్టుకొని రిజిస్ట్రేషన్ పూర్తి అయిన తరువాతే ఇస్తాను అని మల్లేష్ యాదవ్ నమ్మించాడు. అది నమ్మి నరసింహారెడ్డి మార్చి 15న తన పొలంలో మాదాసు వెంకటేశ్వర్లు పేరిటా రిజిస్ట్రేషన్ చేశాడు. నిందితుడి తన వద్ద ఉన్న ఫిర్యాదికి చెందిన రూ.15 లక్షలు, మాదాసు వెంకటేశ్వర్లు వద్ద నుంచి రావాల్సిన రూ.25.50 లక్షలు మొత్తం రూ.40.50 లక్షలు తీసుకొని రిజిస్ట్రేషన్ ఆఫీస్ నుంచి పరిపోయాడు. నిందితుడికి ఫిర్యాది ఎన్ని సార్లు ఫోన్ చేసిన స్పందించక పోవడంతో మోసపోయినట్లు గ్రహించి సదరు విషయం గురించి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీఐ పి.ప్రభాకరరావు ఆధ్వర్యంలో ఎస్‌ఐ సంధ్య రాణి దర్యాప్తు చేపట్టారు. టెక్నాలజీని ఉపయోగించి నిందితుడిని చిత్తూరు జిల్లాలో ఉన్నట్లు గుర్తించి అరెస్ట్ చేశారు. అతడి వద్ద నుంచి నగదు రికవరీ చేసి మాచర్ల కోర్టులో హాజరు పరచగా కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది.
డబ్బు రికవరీ
14 రోజులు రిమాండ్ విధించిన కోర్టు
వివరాలు వెల్లడించిన సీఐ ప్రభాకరరావు