పెదకాకాని: రైలు కింద పడి వ్యక్తి మృతి చెందిన ఘటన పెదకాకానిలో జరిగింది. పెదకాకాని సుందరయ్యకాలనీకి సమీపంలో రైల్వేట్రాక్‌పై మృతదేహం ఉన్నట్లు గురువారం తెల్లవారుజామున ౖపైలెట్ ద్వారా గుంటూరు రైల్వే పోలీసులకు సమాచారం అందింది. ఘటనా స్థలానికి రైల్వే ఎస్సై కె.దీపిక సిబ్బందితో చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మృతదేహానికి సమీపంలో డ్రైవింగ్ లైసెన్స్ కనిపించడంతో దాని ఆధారంగా మృతుడు పెదకాకానికి చెందిన పంది గోపీకృష్ణ(32)గా గుర్తించారు. మృతుడి కాళ్లు చేతులు దూరంగా పడి ఉన్నాయి. మృతుడి తండ్రి సాంబశివరావు నాలుగేళ్ల కిందట మరణించారు. గోిపీకృష్ణకు తల్లి జ్యోత్న్ప, తమ్ముడు ఉన్నారు. అతడు లారీ డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నాడు. ఇంకా పెళ్లి కాలేదు. ఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే పోలీసులు మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే ఎస్‌ఐ కడలి దీపిక తెలిపారు.