● భక్తిశ్రద్ధలతో పునీత జోజిప్ప మహోత్సవం ● పెద్దసంఖ్యలో పాల్గొన్న భక్తులు ● ఆకట్టుకున్న సాంఘిక నాటిక
పెదకూరపాడు: మండలంలోని జలాల్‌పురంలో బుధవారం పునీత జోజిప్ప దేవాలయ పండగను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. పాటిబండ్లి విచారణ గురువులు రెవరెండ్ హదయకుమార్, సహాయక గురువులు సురేష్ ఆధ్వర్యంలో ప్రత్యేక దివ్య పూజ బలిని నిర్వహించారు. భక్తులను ఉద్దేశించి హదయకుమార్, సురేష్ మాట్లాడారు. ఆధ్యాత్మక చింతనతో ప్రతి ఒక్కరూ సిలువ మార్గంలో నడవాలని కోరారు. తోటి వారికి సాయం చేస్తూ క్రీస్తు చూపిన మార్గంలో నడవాలని కోరారు. పునీత జోజిప్ప మానవాళికి మార్గదర్శమని తెలిపారు. పలువురు గురువులు మహోత్సవంలో పాల్గొన్నారు. భక్తులకు పునీత జోజిప్ప మహోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఉత్సవాల సందర్భంగా దేవాలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరిచారు. బాల ఏసు యువజన నాట్యమండలి కళాకారులు ప్రత్యేక నాటికలను ప్రదర్శించారు. రాత్రి భారీ బాణసంచా కాల్చుతూ, మేళతాళాలతో గ్రామంలో తేరు ఊరేగింపు నిర్వహించారు.