నరసరావుపేట: ప్రతీ ఒక్క మహిళ శక్తియాప్‌ను ఫోన్‌లో నిక్షిప్తం చేసుకుని ఆపద సమయంలో పోలీసు వారి తక్షణ సహాయం పొందాలని జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు కోరారు. సోమవారం పోలీసు ప్రధాన కార్యాలయానికి ప్రజాసమస్యల పరిష్కార వేదికకు విచ్చేసిన మహిళలకు యాప్ వివరాల కరపత్రాలు పంచి వాటి ప్రాముఖ్యతను వివరించారు. అనంతరం శక్తి పోస్టర్ ఆవిష్కరించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ ఈ యాప్ ప్రధానంగా మహిళలపై జరిగే వేధింపులు, లైంగికదాడులు, ఇతర హింసాత్మక సంఘటనలను నివారించటానికి ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. పల్నాడు జిల్లాలో మహిళలు, గృహిణులు, విద్యార్థినులు వారి ఫోన్లులో శక్తి యాప్‌ను నిక్షిప్తం చేసుకుని ఆపద సమయంలో పోలీసు వారి తక్షణ సహాయం, సహకారం పొందాలని కోరారు. అదనపు ఎస్పీ (పరిపాలన) జేవీ సంతోష్, మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీ వెంకట రమణ, మహిళా పోలీస్ స్టేషన్ సీఐ సుభాషిణి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు