క్వారీ దేవస్థానంలో ఎస్పీ దంపతుల ప్రత్యేక పూజలు | - | Sakshi
Sakshi News home page

క్వారీ దేవస్థానంలో ఎస్పీ దంపతుల ప్రత్యేక పూజలు

Published Mon, Mar 17 2025 11:13 AM | Last Updated on Mon, Mar 17 2025 11:08 AM

చేబ్రోలు: జిల్లాలో ఖ్యాతిగాంచిన చేబ్రోలు మండలం వడ్లమూడి క్వారీ బాలకోటేశ్వరస్వామి దేవస్థానంలో ఆదివారం గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్‌ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కుటుంబ సమేతంగా ఆలయానికి వచ్చిన ఎస్పీ దంపతులకు ఆలయ అర్చకులు గూడూరు సాంబశివరావు, శ్రీనివాసశర్మ తదితరులు స్వాగతం పలికారు. అనంతరం ఎస్పీ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవదాయశాఖాధికారి పి.రామకోటేశ్వరరావు వారిని సత్కరించి, ప్రసాదం అందజేశారు. ఎస్‌ఐ డి.వెంకటకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

కేజీబీవీల్లో కౌన్సెలర్ల నియామకం

నరసరావుపేట ఈస్ట్‌: జిల్లావ్యాప్తంగా ఉన్న 24 కస్తూర్భా గాంధీ బాలికా విద్యాలయాల్లో విద్యార్థినులకు మానసిన స్థైర్యం కల్పించేందుకు ఐదుగురు కౌన్సెలర్లను నియమించినట్లు జిల్లా బాలికా సంక్షేమాభివృద్ధి అధికారి డి.రేవతి ఆదివారం తెలిపారు. కేజీబీవీ పాఠశాలల్లోని బాలికలకు మానసిక ఆరోగ్యంపై అవగాహన కల్పించి వారిలో ఒత్తిడిని జయించేలా తగు సూచనలను కౌన్సెలర్లు అందిస్తారని వివరించారు. జె.అశోక్‌, ఎ.శాంతివర్థన్‌, కె.ప్రేమ్‌కుమార్‌, యూసఫ్‌ షరీఫ్‌, ఫణింద్రకుమార్‌లను కౌన్సెలర్లుగా సమగ్ర శిక్ష రాష్ట్ర కార్యాలయం నియమించినట్టు తెలిపారు. రానున్న వారం రోజుల్లో 14 పాఠశాలలోని విద్యార్థినులకు కౌన్సెలర్లు గ్రూప్‌ కౌన్సెలింగ్‌ నిర్వహిస్తారని తెలిపారు.

టెన్త్‌ పరీక్షల విధులకు గైర్హాజరైన టీచర్లకు షోకాజ్‌ నోటీసులు

గుంటూరు ఎడ్యుకేషన్‌: పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల విధుల్లో ఇన్విజిలేటర్లుగా నియమించిన 10 మంది ఉపాధ్యాయులకు గుంటూరు తూర్పు ఎంఈవో అబ్దుల్‌ ఖుద్దూస్‌ ఆదివారం షోకాజ్‌ నోటీసులు ఇచ్చారు. గుంటూరు తూర్పు నియోజకవర్గ పరిధిలోని వివిధ ప్రభుత్వ, నగరపాలకసంస్థ ఉన్నత పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులను వేర్వేరు పాఠశాలల్లో ఇన్విజిలేటర్లుగా నియమించారు. అయితే వీరిలో 10 మంది ఉపాధ్యాయులు సోమవారం నుంచి జరగనున్న టెన్త్‌ పబ్లిక్‌ పరీక్షల విధులకు హాజరయ్యేందుకు ఆదివారం సంబంధిత పరీక్షా కేంద్రాల చీఫ్‌ సూపరింటెండెంట్లకు రిపోర్టు చేయలేదు. దీంతో సంబంధిత ఉపాధ్యాయులకు షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు.

హామీలు నెరవేర్చేందుకు కృషి

కేంద్ర మంత్రి పెమ్మసాని

పెదకాకాని: ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటీ నెరవేరుస్తున్నామని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ చెప్పారు. పెదకాకాని మండలంలోని తక్కెళ్ళపాడు, పెదకాకాని, కొప్పురావూరు గ్రామాల్లో కొత్తగా నిర్మించిన సీసీ రోడ్లను పెమ్మసాని ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్రకుమార్‌తో కలిసి ఆదివారం ప్రారంభించారు. సీఎం చంద్రబాబు త్వరలో తల్లికి వందనం, మహిళలకు జిల్లాలో ఉచిత బస్సు ప్రయాణం అమలుతోపాటు అన్నదాతలకు రైతు భరోసా నిధులు విడుదలకు కృషి చేస్తున్నట్టు వివరించారు.

క్వారీ దేవస్థానంలో ఎస్పీ దంపతుల ప్రత్యేక పూజలు 1
1/2

క్వారీ దేవస్థానంలో ఎస్పీ దంపతుల ప్రత్యేక పూజలు

క్వారీ దేవస్థానంలో ఎస్పీ దంపతుల ప్రత్యేక పూజలు 2
2/2

క్వారీ దేవస్థానంలో ఎస్పీ దంపతుల ప్రత్యేక పూజలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement