నగరంపాలెం(గుంటూరు వెస్ట్) : ఏపీలోని నందు (నంది అవార్డులు)లు అస్వస్థతకు గురైనట్లు మా–ఏపీ వ్యవస్థాపకులు, సినీ దర్శకుడు దిలీప్‌రాజా వ్యాఖ్యానించారు. గుంటూరు బ్రాడీపేటలోని ఓ హోటల్‌లో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో గద్దర్ పేరుతో అవార్డులు ప్రదానం చేసేందుకు దరఖాస్తులు స్వీకరిస్తున్నారని తెలిపారు. ఏపీలో మాత్రం 2013 నుంచి నిలిపివేసిన నంది అవార్డుల ప్రదానంపై విధి విధానాలను ప్రభుత్వం రూపొందించాలని కోరారు. నంది అవార్డులకు 2014 నుంచి గ్రహణం పట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు. అవార్డుల ఎంపిక విధానంలో ప్రతిభను మాత్రమే గుర్తించాలని డిమాండ్ చేశారు. సినీ పరిశ్రమను, సినిమా కళాకారులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. దర్శకులు నరేష్ దోనె, మణివరన్ పాల్గొన్నారు.