మంగళగిరి/మంగళగిరి టౌన్: జై నారసింహా.. జైజై నారసింహా నినాదాలతో మంగళగిరి శుక్రవారం మార్మోగింది. శ్రీ లక్ష్మీనరసింహుని దివ్య రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. రథోత్సవాన్ని తిలకించేందుకు తరలివచ్చిన భక్తులతో పురవీధులు కిటకిటలాడాయి. స్వామి బ్రహ్మోత్సవాలు 11 రోజులుగా అత్యంత వైభవంగా సాగుతున్నాయి. గురువారం రాత్రి స్వామి కల్యాణమహోత్సవం వైభవంగా జరిగింది. శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటలలకు ఉభయదేవరులతో స్వామి దివ్యరథాన్ని అధిరోహించారు. మూడు గంటల పాటు రథోత్సవం సాగింది. గాలిగోపురం నుంచి దక్షిణాభిముఖంగా ప్రారంభమైన రథం మెయిన్ బజార్ మిద్దె సెంటర్‌లోని ఆంజనేయస్వామి ఆలయం వరకు కదలింది. అక్కడ ఆంజనేయస్వామి, వినాయక ఆలయాల్లో ప్రత్యేక పూజల అనంతరం తిరిగి గాలిగోపురం వద్దకు చేరుకుంది. స్వామి దివ్య మంగళ స్వరూపాన్ని భక్తులు తిలకించి ముగ్ధులయ్యారు. ఉత్సవ కై ంకర్యపరులుగా మాడభూషి వేదాంతచార్యులు వ్యవహరించారు. పద్మశాలీయ శ్రీ లక్ష్మీనృసింహస్వామి రథ చప్పాల కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
నమో నారసింహా
మంగళాద్రి.. ‘జన’దాద్రి
అంగరంగ వైభవంగా
నృసింహుని దివ్య రథోత్సవం