వినియోగదారులు తూకాల్లో మోసాలపై ప్రశ్నించటంతోనే మార్పు మొదలవుతుంది. అధికారులు తనిఖీల సమయంలో మోసాలు గుర్తించి కేసులు, జరిమానాలు విధిస్తున్నారే తప్పా వినియోగదారుల నుంచి ఎక్కువ ఫిర్యాదులు రావటం లేదు. అధిక శాతం పెట్రోల్ బంక్‌లో అక్రమాలు, కూల్‌డ్రింక్ అధిక ధరలు, తూకాల్లో వ్యత్యాసం వంటి వాటిపై ఫిర్యాదులు వస్తున్నాయి. వెంటనే దాడులు నిర్వహించి నివారణకు చర్యలు తీసుకుంటున్నాం. గత ఏడాది కంటే ఈ ఏడాది కేసులు అధికంగా నమోదు అయ్యాయి.
– నల్లబోతుల అల్లూరయ్య,
అసిస్టెంట్ కంట్రోలర్, పల్నాడు జిల్లా