ఎమ్మెల్యే చదలవాడ చర్యలు నీతి బాహ్యం | - | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యే చదలవాడ చర్యలు నీతి బాహ్యం

Mar 12 2025 8:02 AM | Updated on Mar 12 2025 8:01 AM

నరసరావుపేట: పల్నాడు జిల్లా నరసరావు పేట టీడీపీ ఎమ్మెల్యే డాక్టర్‌ చదలవాడ అరవిందబాబు చర్యలు నీతిబాహ్యంగా ఉన్నా యని మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. అసలు ఆయన అధికారపక్షంలో ఉన్నరా, ప్రతిపక్షంలో ఉన్నారో నియోజకవర్గ ప్రజలకు అంతుబట్టడంలేదని అన్నారు. పార్టీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉంటూ రెండు రోజుల క్రితం ప్రభుత్వ కార్యాలయమైన ఎకై ్సజ్‌ కమిషనరేట్‌లో ధర్నా చేయడం, ఆ పార్టీ నాయకులు వారించినా లెక్క చేయకపోవడం, అధికారులను ఇబ్బంది పెట్ట డం సముచితంగా లేదన్నారు. గత 20 ఏళ్లు గా అనేకమంది ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగస్తులు అనేక ప్రభుత్వ విభాగాల్లో పనిచేస్తున్నారని, వారందరూ ఒకే పార్టీకి చెందిన వారు కాదని, వీరి కోసం గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం ఆప్కాస్‌ ఏర్పాటు చేసి వారికి ఉద్యోగ భద్రతను కల్పించిందన్నారు. కేవలం ప్రతిపక్షానికి చెందిన వారనే నెపంతో 11 కుటుంబాల వారిని అన్యాయంగా తీసివేయాలనుకోవటం దుర్మార్గ పాలనకు నిదర్శనమన్నారు. ఈ ఎమ్మెల్యే మాట నరసరావుపేట, రొంపిచర్ల తహసీల్దార్లు వినడం లేదని తాను చెప్పిన పనులు చేయడం లేదంటూ కలెక్టర్‌కు ఫిర్యా దు ఇవ్వటం బట్టి చూస్తే ఇతని మాట అధికారులు వినటం లేదేమో అనే వాదన ప్రజల్లో బలపడుతుందన్నారు. పట్టణంలో అనుమతి లేకుండా లేఅవుట్లు గత ప్రభుత్వంలో వేశా రని చెబుతున్నారని, ఇప్పుడు తొమ్మిది నెలల కాలంలో అనేక అన్‌ఆధరైజ్డ్‌డు లే అవుట్లు వెలిశాయని చెప్పారు. దీనికి తన వద్ద రుజువు కూడా ఉన్నాయని, తాను రుజువు చేయగలనని దీనికి మీరు ఏం సమాధానం చెబుతారని సూటిగా ప్రశ్నించారు.

కోటప్పకొండ దేవుని మాన్యంలో

మట్టి తోలుకుంటున్నారు

కోటప్పకొండ దేవస్థానంకు సంబంధించిన ఆరున్నర ఎకరాల దేవదాయ భూమిని నాయీ బ్రాహ్మణులకు కేటాయిస్తే ఆ భూమి ని ఆక్రమించుకొని ఎమ్మెల్యే, ఆయన మనుషులు మట్టి తోలుకుంటున్నారని చెప్పారు. స్వయానా ఈ మట్టితవ్వే భూములను పరిశీలించిన కోటప్పకొండ ఈవో ఇది దేవస్థానానికి సంబంధించిన భూమి అని నిర్ధారించారన్నారు. అక్కడ ఉన్న వాహనాలను విజిలెన్స్‌ అధికారులు సీజ్‌ చేశారన్నారు. ఇంత జరిగి నా మళ్లీ అసెంబ్లీలో అతనే ప్రస్తావించటాన్ని చూస్తే అతనికి నైజం ఏమిటో అర్థమౌతుందన్నారు. ఎనిమిది అడుగుల లోతు మట్టి తీసి అమ్ముకున్నారని, ఇప్పుడు ఈ గుంటలు పడ్డ భూమి సాగుకి, దేవదాయ శాఖకు పనికిరాదని ఇప్పుడు ఈ భూమికి సంబంధించిన నష్టపరిహారాన్ని ఎవరు భరిస్తారని దీనికి ఎమ్మెల్యేనే సమాధానం చెప్పాలని కోరారు.

కోడెల శివరామ్‌పై కేసులతో

నాకు సంబంధం లేదు

కోడేల శివరాం అభిమానుల పేరుతో తనపైన, విజయసాయిరెడ్డిపై శ్రీకాకుళం జిల్లా పోలాకి మండలం ఎవారిపేట గ్రామానికి చెందిన ఆంధ్ర మాజీ రంజీ క్రికెటర్‌ నాగరాజు అనే వ్యక్తి టీడీపీ నాయకులు కేసు పెట్టించారని అన్నారు. అయితే అతనెవరూ, అతని ఊరు, మండలం కూడా తమకు తెలియదన్నారు. 2019లో అధికారం వచ్చిన తర్వాత ఈ నాగరాజు అనే వ్యక్తి తన వద్దకు వచ్చి నేను శివరాంకు రూ.15 లక్షలు లంచంగా ఇచ్చానని, నా డబ్బు నాకు ఇప్పించడని వేడుకున్నాడన్నారు. అతడిని పోలీసుల వద్దకు పంపటం జరిగిందన్నారు. కేసులు పెట్టింది కోడెల శివరాంపైనే కాని కోడెలపై కాదని అన్నారు. నాగరాజు ఈరోజు తన కేసు లోక్‌ అదాలత్‌లో చేసుకున్నాడని అతని ద్వారా మీడియా ముందు మాట్లాడించి కేసు క్లోజ్‌ చేశారని చెప్పారు.

టీడీపీ ప్రభుత్వ వేధింపుల్లో

భాగమే నాపై కేసు

కోడెల శివరాం అక్రమాలపై ఫిర్యాదు చేసిన వారే మాట మార్చారు!

వినుకొండరోడ్డు వెంచర్‌లో ప్రభుత్వ భూమిలేదని అధికారులు తేల్చారు

కోటప్పకొండలోని నాయీ బ్రాహ్మణుల భూమిలో ఎమ్మెల్యే మట్టి తవ్వకాలు

మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement