
మాస్టర్ అథ్లెటిక్స్ పోటీల్లో సత్తా చాటిన ఐలవరం పీడీ శ్రీనివాసరెడ్డి (మధ్యలో)
ఐలవరం(భట్టిప్రోలు): ఈ నెల 8 నుంచి 10వ తేదీ వరకు తిరుపతి వేంకటేశ్వర యూనివర్సిటీలో జరిగిన రాష్ట్రస్థాయి మాస్టర్స్ అథ్లెటిక్స్ పోటీలలో భట్టిప్రోలు మండలం ఐలవరం జిల్లా పరిషత్ హైస్కూల్ ఫిజికల్ డైరెక్టర్ తుమ్మా శ్రీనివాసరెడ్డి సత్తా చాటారు. 55 ప్లస్ విభాగంలో లాంగ్ జంప్, ట్రిపుల్ జంప్‌లో గోల్డ్ మెడల్, హై జంప్‌లో రజత పతకం సాధించి రాష్ట్రస్థాయిలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచారు. ఉత్తమ ప్రదర్శన కనబరచిన శ్రీనివాసరెడ్డి రాష్ట్రస్థాయిలో బాపట్ల జిల్లా భట్టిప్రోలు మండలానికి పేరు ప్రఖ్యాతలు తీసుకువచ్చారు. వచ్చే ఏడాది ఫిబ్ర వరి 13 నుంచి 15వ తేదీవరకు మహారాష్ట్రలో జరిగే జాతీయస్థాయి మాస్టర్ అథ్లెటిక్ పోటీలకు శ్రీనివాసరెడ్డి అర్హత సాధించారు. ఈ సందర్భంగా ఆయనను ఎంఈఓలు పులి లాజర్, నీలం దేవరాజులు, హైస్కూల్ హెచ్‌ఎం మాచర్ల మోహన్‌రావు, సహచర ఉపాధ్యాయులు అభినందించారు.
జాతీయస్థాయి మాస్టర్ అథ్లెటిక్ పోటీలకు అర్హత సాధించిన శ్రీనివాసరెడ్డి బాపట్ల జిల్లా ఖ్యాతిని ఇనుమడింప చేసిన పీడీ పలువురి అభినందనలు