జయపురం: సమాజ సేవే రోటరీ క్లబ్ ప్రధాన లక్ష్యమని రోటరీ డిస్ట్రిక్ట్ 3262 గవర్నర్ రొటేరియన్ మనోజ్ కుమార్ త్రిపాఠీ అన్నారు. శనివారం రాత్రి స్థానిక సిగ్నేచర్ సభా వేదికలో జరిగిని జయపురం రోటరీ క్లబ్ ప్రైడ్ నిర్వహించిన సమావేశానికి హాజరయ్యారు. జయపురం రోటరీ క్లబ్ ప్రైడ్ అధ్యక్షుడు రబినారాయణ నందో అధ్యక్షతన జరిగిన సమావేశంలో త్రిపాఠీ ప్రసంగించారు. ప్రతీ రొటేరియన్ సమాజంతో ప్రజల జీవనప్రమాణాల మెరుగుకు, ప్రజలకు సేవలు అందించేందుకు కట్టుబడి ఉండాలన్నారు. జయపురం రోటరీ క్లబ్ కార్యదర్శి గతేడాది నిర్వహించిన వివిధ ప్రజా సేవా కార్యక్రమాలను వివరించారు. వివిధ రంగాల్లో సమాజానికి ప్రశంసనీయ సేవలు అందించిన 11 మందిని సన్మానించారు. సంజయ కుమార్ గొలాబ్, శంకర దళపతి, రామకృష్ణ భోల్, రామానుజ బెహరా, అభయ చంద్ర పండా, కృష్ణ కేశవ షొడంగి, ప్రేమలత మహారాణ, సుధీర్ భాగ్, రబి మఝి, విక్రమదేవ్ విశ్వవిద్యాలయ పురుష, మహిళ ఎన్‌సీసీ కేడర్ విద్యార్థులను సన్మానించారు. 25 ఏళ్లుగా రోటరీ క్లబ్ సభ్యులుగా ఉంటూ సమాజానికి సేవలు అందిస్తున్న 20 మంది సభ్యులను డిస్ట్రిక్ట్ గవర్నర్ రొటేరియన్ మనోజ్ కుమార్ త్రిపాఠీ రోటరీ బ్యాడ్జ్‌లతో సత్కరించారు. రోటరీ సభ్యులు నారాయణ నిశంకొ, మధుశ్మిత త్రిపాఠీ, వెంకట రాబు, శివాజీ పట్నాయక్, తదితరులు పాల్గొన్నారు.


