ట్రక్కుని ఢీకొట్టిన అంబులెన్స్‌ | - | Sakshi
Sakshi News home page

ట్రక్కుని ఢీకొట్టిన అంబులెన్స్‌

Apr 12 2026 2:30 AM | Updated on Apr 12 2026 2:30 AM

ఒకరి మృతి

మరొకరికి తీవ్రగాయాలు

భువనేశ్వర్‌: ఢెంకనాల్‌ జిల్లా హల్దియాబహాల్‌ 55వ నంబర్‌ జాతీయ రహదారిపై నిలిచి ఉన్న ట్రక్కును శనివారం అంబులెనన్స్‌ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అంబులెన్‌న్స్‌ సిబ్బంది ఒకరు మృతి చెందారు. డ్రైవర్‌ తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుడిని ఆస్పత్రిలో చేర్చారు. భువనేశ్వర్‌లో ఓ రోగిని దింపి అంగుల్‌ ప్రాంతానికి అంబులెన్స్‌ తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది. మోటంగా ఠాణా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం కోసం పంపించారు.

Advertisement
 
Advertisement
Advertisement