రాయగడ: జిల్లాలోని కాసీపూర్ సమితి కంటమాల్ లో రహదారి నిర్మించే విషయంలో అడ్డుకున్న గ్రామస్తులపై పోలీసులు దురుసుగా ప్రవర్తించిన సంఘటనపై వామపక్ష నాయకులు శుక్రవారం ఆ గ్రామంలో పర్యటించారు. సీపీఐ రాష్ట్ర శాఖ కార్యద ర్శి డాక్టర్ ప్రశాంత్ కుమార్ మిశ్రో నేతృత్వంలో సీపీఐఎంకి చెందిన రాష్ట్ర శాఖ కార్యదర్శి సురేష్ చంద్ర పాణిగ్రహి, సీపీఐ ఎంఎల్ లిబరేషన్‌కి చెందిన రాష్ట్ర శాఖ కార్యదర్శి యుధిష్టర్ మహాపాత్రో, ఆలిండి యా ఫార్వర్డ్ తరగతులకు చెందిన రాష్ట్ర శాఖ అధ్యక్షుడు పూర్ణచంద్ర షడంగి, తిరుపతి గొమాంగో తదితర నాయకులు పర్యటనలో ఉన్నారు. ముందుగా గ్రామస్తులతో సమావేశమైన నాయకులు అసలు జరిగిన విషయమై ఆరాతీశారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తామంతా అండగా ఉంటా మని భరోసా ఇచ్చారు. ఆదివాసీల హక్కులను కాలరాస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అందుకు తాము కూడా ఆందోళనకు సహకరిస్తామ ని అన్నారు. అర్ధరాత్రి నిందితుని అరెస్టు చేసేందు కు పోలీసులు కంటమాల్ గ్రామానికి వెళ్లి సృష్టించి న రభస గురించి తెలుసుకున్నారు. అక్కడితో ప్రా రంభమైన ఘటన చినికి చినికి వానలా మారిందని అన్నారు. రహదారి నిర్మించే విషయంలో అడ్డుకున్న గ్రామస్తులపై పోలీసులు దురుసుగా ప్రవర్తించడంతో పాటు టియర్ గ్యాస్ వంటివి వినియోగించడం ఎంతవరకు సమంజసమని అన్నారు. పోలీసులు, గ్రామస్తుల మధ్య జరిగిన ఘర్షణలో కేవలం పోలీసులకు మాత్రమే గాయాలైనట్లు వస్తున్న ప్రచారా న్ని వామపక్ష నేతలు ఖండించారు. అంతకు ముందురోజు కంటమాల్ గ్రామంలో పోలీసులు అర్ధరా త్రి చేపట్టిన నిర్వాకంలో చాలామంది గ్రామస్తులు గాయపడిన విషయం మరిచిపొకూడదని అన్నారు. మహిళలని చూడకుండా వారిపై దాడి చేయడం పోలీసుల నిరంకుశ వైఖరికి నిదర్శనంగా ఉందని నాయకులు ఆరోపించారు. అనంతరం కంటమాల్ లో చోటు చేసుకున్న ఘటనకు సంబంఽధించి సమగ్ర దర్యాప్తు జరపాలని కోరుతూ జిల్లా కలెక్టర్ అశుతోష్ కులకర్ణికి వినతిపత్రం సమర్పించారు.


