ఘన సత్కారం
పర్లాకిమిడి: దక్షిణ ఒడిశాలో విశిష్ట యువ గాయకుడు డాక్టర్ చందన్ గంతాయత్‌ను ఒడిశా సంగీత నాటక అకాడమీ ద్వారా కవిచంద్ర కాళీచరణ్ పట్నాయక్ యువప్రతిభా అవార్డు అందుకున్న సందర్భంగా పర్లాకిమిడి క్రియేటివ్ ఆర్ట్స్, పేరొందిన సంస్కృతిక సంస్థ భక్తి నైవేద్యంతో కలిసి సత్కరించారు. ఈ సత్కార సభ స్థానిక కరణం వీధిలో లక్ష్మీనర్సింహ కళ్యాణ మండపంలో ఆదివారం సాయంత్రం జరిగింది.
ఈ సత్కార సభకు జిల్లా సాంస్కృతికశాఖ అధికారి అర్చనా మంగరాజ్, సంగీత దర్శకులు రఘునాథ పాత్రో, నాటకరంగం కళాకారుడు ఆదర్శ దాస్, నృసింహా చరణ్ పట్నాయక్ తదితరులు హాజరయ్యారు. డాక్టర్ చందన్ గంతాయత్ రాయగడ జిల్లా గుణుపురం వాసి అయినా గంజాం జిల్లాలో డాక్టర్‌గా సేవలు అందిస్తున్నారు. సంగీత సాధనలో అనేక కార్యక్రమాల్లో డాక్టర్ చందన్ గంతాయత్ పర్లాకిమిడి కళాకారులకు సుపరిచితుడే అని క్రియేటివ్ ఆర్ట్స్ అధ్యక్షుడు నృసింహా చరణ్ పట్నాయక్ అన్నారు.


