జీసీడీ వాకర్స్ క్లబ్ నూతన కార్యవర్గం
రాయగడ: స్థానిక జీసీడీ వాకర్స్‌క్లబ్‌కు నూతన కార్యవర్గం ఏర్పాటయ్యింది. క్లబ్ అధ్యక్షులుగా జగన్నాధ సాహు, ఉపాధ్యక్షులుగా వివేకానంద సాహు, జామి రాజ, కార్యదర్శిగా ముచ్చి రవి, సహాయ కార్యదర్శిగా కింతలి సురేష్, పొలి వాకర్స్‌గా గుడ్ల నెహ్రూ, కోశాధికారిగా సుభాష్ చంద్ర బారిక్‌లు నియమితులయ్యారు. జీసీడీ మైదానంలో ఆదివారం ప్రత్యేకంగా జరిగిన సమావేశంలో క్లబ్ వ్యవస్థాపకులు సురేంద్ర సాహు, మాజీ అధ్యక్షులు చిన్నారి విజయ్ మోహన్, మనోజ్ రథ్, దీపక్ పృష్టి, అజిత్ కుమార్ సుబుద్ధి పాల్గొన్నారు. కొత్త ఏడాది నుంచి కార్యకలాపాలను నిర్వహిస్తుందని సభ్యులు తెలిపారు.


