సాంకేతికత అట్టడుగు వర్గాలకు చేరాలి
● గవర్నర్ హరిబాబు కంభంపాటి
భువనేశ్వర్: సాంకేతిక పరిజ్ఞానం నిరంతరం మానవ సంక్షేమానికి దోహదపడాలని, వరదల నుంచి దుర్భల గ్రామాలను రక్షించడం, రైతులకు పంటల సాగు ప్రణాళిక రూపకల్పన, సంద్రం నడి బొడ్డున వేటలో నిమగ్నమైన మత్స్యకారులు సకాలంలో సురక్షితంగా తీరం చేరడం, నగరాల్లో వాయు కాలుష్య నివారణ తదితర దైనందిన కార్యకలాపాల్లో సాంకేతికత అణువణువుగా అండగా నిలిచి సార్థకం కావా లని గవర్నర్ డాక్టర్ హరిబాబు కంభంపాటి పిలుపునిచ్చారు. ఐఐఐటీ భువనేశ్వర్‌లో జరిగిన ఐఈఈఈ ఇండియా జియోసైన్స్ అండ్ రిమోట్ సెన్సింగ్ సింపోజియం (ఐఎన్‌జీఏఆర్‌ఎస్‌ఎస్ 2025) ప్రారంభ సమావేశంలో ఆయన మాట్లాడారు.
వైజ్ఞానిక ఆవిష్కరణలు నిరంతరం ప్రజా సంక్షేమానికి సేవ చేయాలని గవర్నర్ అన్నారు. శాస్త్రవేత్తలు, పరిశోధకులు, సాంకేతిక నిపుణులు, యువ మేధావులకు ఈ సమావేశం మెరుగైన భవిష్యత్ ఆవిష్కరణకు అవసరమైన ఉత్సుకత స్ఫూర్తిని ప్రతిబింబిస్తుందని దేశ, విదేశాల నుండి విచ్చేసిన నిపుణులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సింపోజియం ఉత్తమం విశ్వం, ఉజ్వలం భవిష్యం–మెరుగైన ప్రపంచం, ప్రకాశవంతమైన భవిష్యత్తు ఇతివృత్తంతో సంకల్పించిన ఈ కార్యక్రమం జియోసైన్స్, రిమోట్ సెన్సింగ్ రంగాలు విపత్తులను అంచనా వేసి వ్యవసాయానికి మద్దతు కల్పించడం, అడవులను సంరక్షణ, పట్టణ ప్రణాళికకు మార్గనిర్దేశాల్ని ఖరారు చేసి దైనందిన జీవితాన్ని ప్రత్యక్షంగా దోహదపడేలా జయప్రదం కావాలని గవర్నర్ ఆకాంక్షించారు.
విపత్తు నిర్వహణలో రాష్ట్రం చేసిన ప్రయాణం ప్రపంచ గుర్తింపును పొందడం విశేషం. ఉపగ్రహ సమాచారం, రాడార్ ఇమేజింగ్ మరియు జియోస్పేషియల్ అనలిటిక్స్, ముందస్తు హెచ్చరిక వ్యవస్థలను బలోపేతం చేసి ఫైలిన్, ఫణి, యాస్ మరియు ఇటీవల మొంథా వంటి తుఫానుల సమయంలో పెద్ద ఎత్తున తరలింపులను చేపట్టి అపార ప్రాణ హాని నివారించడం సాంకేతికతని సకాలంలో వాస్తవ కార్యాచరణకు సానుకూలంగా మలచుకోవడం విపత్తు నిర్వహణలో దక్షతకు నిదర్శనంగా పేర్కొన్నారు.
రాష్ట్రం అటవీ, వ్యవసాయం, ఖనిజ పదార్థాల తవ్వకాల నియంత్రణ, నీటి నిర్వహణ మరియు పర్యావరణ పరిరక్షణలో జియోస్పేషియల్ సాధనాలను సద్వినియోగపరచుకుంటుందన్నారు. డిజిటల్ మహా సముద్ర పటాలు మరియు రిమోట్ సెన్సింగ్ ఆధారిత ఫిషింగ్ జోన్ అంచనాలు తీరప్రాంతంలో జీవనోపాధిని గణనీయంగా మెరుగుపరుస్తున్నాయని ఆయన అన్నారు. కృత్రిమ మేధస్సు ప్రయోగంతో ఉపగ్రహ చిత్రాల ఏఐ–ఆధారిత విశ్లేషణ వాతావరణ పర్యవేక్షణ, పట్టణ ప్రణాళిక, నీటి సంరక్షణ మరియు వ్యవసాయ కార్యకలాపాల్ని మరింత మెరుగుపరుస్తుందని గవర్నర్ అన్నారు. పరిశోధనల ద్వారా ఉత్పత్తి చేయబడిన జ్ఞానం చివరికి చేరుకోవాలని ఆయన నొక్కి చెప్పారు. ‘సాంకేతిక పరిజ్ఞానం అట్టడుగు వర్గాలకు చేరుకని కలు పుకొనిపోయినప్పుడే అర్థవంతంగా పరిణతం అవు తుందన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రముఖ ముఖ్య కార్యదర్శి మనోజ్ అహుజా, ఎలక్ట్రానిక్, సాంకేతిక సమాచార శాఖ ప్రత్యేక కార్యదర్శి ప్రదీప్ కుమార్ రౌత్, జీఏఆర్‌ఎస్‌ఎస్ అధ్యక్షుడు డాక్టర్ సైబున్ థుట్జా, నాసా శాస్త్రవేత్త డాక్టర్ పాల్ ఎ. రో సెన్, ఐఐఐటీ భువనేశ్వర్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఆశిష్ ఘోష్, జాదవ్‌పూర్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫె సర్ సుస్మితా ఘోష్ తదితరులు ప్రసంగించారు.
సాంకేతికత అట్టడుగు వర్గాలకు చేరాలి


