ఒడిశా వాసి గోవాలో ఆత్మహత్య..!
పర్లాకిమిడి: ఉపాధి కోసం మోహనా బ్లాక్ లిల్లిగుడ పంచాయతీ డెంగోఅంబో గ్రామానికి చెందిన సనియా మల్లిక్ కుమారుడు జయ మల్లిక్ (18) గోవా వెళ్లి అక్కడ హోటల్ బాత్‌రూమ్‌లో ఆత్మహత్య చేసుకున్నట్టు సమాచారం అందింది. మృతుడు జయ మల్లిక్ టవల్‌తో బాత్ రూమ్‌లో తక్కువ ఎత్తులో ఎలా ఆత్మహత్య చేసుకున్నాడో సందేహంగా ఉందని తండ్రి అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మోహనా బ్లాక్ డెంగోఅంబో గ్రామానికి చెందిన జయా మల్లిక్ ఉపాధి కోసం కోద్ది రోజుల క్రితం గోవా వెళ్లి ఒక హోటల్‌లో చేరాడు. నెలరోజులు తిరక్కముందే కుటుంబ సభ్యులు ఈ దుర్వార్త వినాల్సివచ్చింది. జయా మల్లిక్ మృతి వార్త విని డెంగోఅంబో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి. మృతదేహం గజపతి జిల్లా మోహనాలోని స్వగ్రామానికి తీసుకురావడానికి తండ్రి ఏర్పాట్లు చేస్తున్నాడు.


