 
															ఓబీసీ జాబితాలో చేర్చాలని వినతి
పర్లాకిమిడి: గజపతి జిల్లాలో కాపు, కళింగ జాతులను కేంద్ర వెనుకబడిన జాతుల జాబితాలో పొందుపరచి గుర్తించాలని రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడు కోడూరు నారాయణరావు గురువారం భువనేశ్వర్‌లో జరిగిన జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ ప్రజా వినతుల కార్యక్రమంలో విన్నవించారు. జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ చెర్మన్ హంసరాజ్ గంగారాం ఆహిర్‌కు వినతిపత్రాన్ని అందజేశారు. గజపతి జిల్లాలో పర్లాఖెముండి నియోజికవర్గంలో కాపు (ఒడియాలో కంపో), కళింగ జాతుల్లో పల్లి, క్షత్రియులను రాష్ట్ర ఎస్‌ఈబీసీలో జాబితాలో ఉన్నా కేంద్ర ఓబీసీ జాబితాలో పొందుపరచలేదన్నారు. తద్వారా వారు కుటుంబాల పిల్లలు ఉన్నత విద్య, పలు పదవుల్లో రిజర్వేషన్లు కోల్పోతున్నారన్నారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
