 
															అవినీతిని నిర్మూలిద్దాం
జయపురం: అవినీతి నిర్మూలనలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం అవసరమని పలువురు వక్తలు అన్నారు. ఈ నెల 27 నుంచి నవంబర్ 2వ తేదీ వరకు నిర్వహిస్తున్న విజిలెన్స్ అవేర్‌నెస్ వీక్–2025 సందర్భంగా స్థానిక విక్రమదేవ్ విశ్వవిద్యాలయం గురువారం పెద్ద ఎత్తున అవినీతి నిర్మూలన సచేత కార్యక్రమం చేపట్టారు. ఉదయం 9 గంటలకు విశ్వ విద్యాల క్రీడా మైదానం నుంచి రాజనగర్ కూడలి వరకు వేలాదిమంది విద్యార్థులు అవినీతి నిర్మూలన సచేతన ర్యాలీ నిర్వహించారు. విశ్వవిద్యాలయంలో వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ డాక్టర్ దేవీ ప్రసాద్ మిశ్ర అధ్యక్షతన సమావేశం జరిగింది. రిజిస్టార్ మహేశ్వర చంద్రనాయక్, గౌరవ అతిథిగా కొరాపుట్ విజిలెన్స్ డివిజన్ జయపురం అదనపు ఎస్పీ అనంత ప్రసాద్ మల్లిక్, ముఖ్యవక్తగా విజిలెన్స్ స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ శశిధర్ పట్నాయక్ మాట్లాడారు. విశ్వ విద్యాలయ అద్యాపక సిబ్బంది, విద్యార్థులు ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమాన్ని డాక్టర్ పి.కె.పాత్రో పర్యవేక్షించారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
