 
															చోరీ కేసులో ముగ్గురు అరెస్టు
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా కేంద్రంలో జూన్ 3వ తేదీన బండాబాకులిగూడ వద్ద సుభాష్ రాజారామ్ అనే బంగారం వ్యాపారి రాత్రి 11:30 గంటలకు దుకాణం మూసివేసి బంగారం, నగదు బ్యాగుల్లో తీసుకురావడం కోసం తన బైక్ వద్దకు వస్తున్న సమయంలో గుర్తుతెలియని దుండగులు దోచుకుపోయారు. సుభాష్ వెంటనే మల్కన్‌గిరి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమో దు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బుధవారం జయపురంలో ముగ్గురు నిందితులు ఉన్నట్లు సమాచారం రావడంతో మల్కన్‌గిరి నుంచి పోలీసులు వెళ్లి వారి ని అరెస్టు చేశారు. మల్కన్‌గిరి ఎస్పీ వినోద్ పటేల్ వద్ద నిందితులను హాజరుపరిచారు. నిందితుల నుంచి 120 గ్రాముల బంగారం, రూ.4.5 లక్షల నగదు, బైక్, కారును స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై చోరీ కేను నమోదు చేసి మరికొంత సమాచారం సేకరించిన అనంతరం గురువారం కోర్టుకు తరలిస్తామని ఎస్పీ తెలిపారు. నిందితులు బైపరిగూడకు చెందిన కె.సుమాన్‌కుమార్ ఆచారి, ఝయపూరం గ్రామానికి చెందిన కె.మురళి, నవరంగ్‌పూర్‌కి చెందిన ఎ.శ్రీనివాస్ ఆచారి అని ఎస్పీ తెలిపారు.
 
							చోరీ కేసులో ముగ్గురు అరెస్టు

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
