 
															నిర్మానుష్యం..
పర్లాకిమిడి: మూడురోజులు కురిసిన వర్షాలతో గజపతి జిల్లాలో జనజీవనం స్తంభించిపోయింది. పర్లాకిమిడిలో హైస్కూల్ జంక్షన్ వద్ద బుధవారం ఉదయం వర్షం కురిసిన అనంతరం జనజీవనం లేక రోడ్లు ఖాళీగా దర్శనమిచ్చాయి. తుఫాన్ వల్ల రోజు కూలీలు ఇబ్బంది పడ్డారు. భవన నిర్మాణ కార్మికులు, ఆటోలు, బస్సులకు ప్యాసింజర్లు లేక కోన్ని బస్సులను రెండు రోజులపాటు బస్టాండ్‌లోనే నిలిపివేశారు. తుఫాన్ ప్రభావంతో కాయగూరల ధరలు అమాంతం పెరిగిపోయాయి. స్కూళ్లు, ప్లస్‌టు కళాశాలలకు ఈ నెల 30వ తేదీ వరకు ప్రభుత్వ సెలవు ప్రకటించింది.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
