 
															సైబర్ నేరాలపై అప్రమత్తం
జయపురం: సైబర్ నేరాల బారిన పడకుండా ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని జయపురం సబ్‌డివిజన్ పోలీసు అధికారి పార్ధ జగదీష్ కాశ్యప్, పట్టణ పోలీసు అధికారి ఉల్లాస్ చంద్రరౌత్ అన్నా రు. బుధవారం పట్టణంలో సైబర్ సురక్షా అభిజాన్ నిర్వహించారు. సైబర్ నేరాలకు గురికాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. కొరాపు ట్ జిల్లా ఎస్పీ రోహిత్ వర్మ నేతృత్వంలో నవంబర్ 2న కొరాపుట్ నుంచి సైబర్ సచేతన అభిజాన్ రథం బయలు దేరి జయపురం ప్రధాన కూడలికి చేరుతుందని చెప్పారు. అందరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
