శిశుమిత్ర పోలీసుస్టేషన్ ప్రారంభం
మల్కన్‌గిరి: జిల్లాలోని బలిమెల పట్టణంలో శిశుమిత్ర పోలీసుస్టేషన్‌ను ఎస్పీ వినోద్ పటేల్ శనివారం ప్రారంభించారు. తమ చిన్న పిల్లలతో కలిసి పోలీసుస్టేషన్‌కు ఫిర్యాదు చేసేందుకు వచ్చే మహిళలు ఫిర్యాదు చేసే సమయంలో పిల్లలు ఆడుకోవడానికి, చదువుకోవడానికి సౌకర్యాలు ఏర్పాటు చేశారు. అలాగే సీ్త్రలు పిల్లలకు పాలు ఇచ్చేందుకు ప్రత్యేక గదిని సైతం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రష్మిరంజన్ సేనాపతి, చిత్రకొండ ఎస్డీపీవో ప్రదోష ప్రధాన్, ఆర్‌ఐ సత్యప్రియ విశ్వాల్, బలిమెల ఐఐసీ ధీరాజ్ పట్నాయిక్ తదితరులు పాల్గొన్నారు.


