● ముగిసిన టెక్ ఉత్సవ్
పర్లాకిమిడి: స్థానిక ఆర్.సీతాపురం సెంచూరియన్ వర్సిటీలో నిర్వహిస్తున్న టెక్ ఉత్సవ్–2025 శనివారంతో ముగిసింది. రెండు రోజుల పాటు సృజనాత్మక ఆలోచనలు టెక్నాలజీతో అనుసంధానం అనే సబ్జెక్టుపై వేడుకలు నిర్వహించారు. సెంచూరియన్ వర్సిటీ రిజిస్ట్రార్ డా.అనితా పాత్రో ఉత్సవాలను ప్రారంభించగా.. డీన్ (ఇంజినీరింగ్ స్కూల్) ప్రొ.డా.ప్రఫుల్ల కుమార్ పండా స్వాగత ఉపన్యాసం చేశారు. విద్యార్థులు కంప్యూటర్ సైన్సులో కొత్త ఆవిష్కరణలు చేయాలని ఆకాంక్షించారు. ఇంజినీరింగ్ విద్యపై మక్కువ ఉన్న విద్యార్థులు భవిష్యత్తులో సృజనాత్మక, టెక్నాలజీతో సంబంధ ఉన్న ఆవిష్కరణలు సృష్టించడంపై దృష్టి సారించాలని డా.అనితా పాత్రో సూచించారు. అనంతరం కంప్యూటర్ ఇంజినీర్ విద్యార్థులకు హాకథాన్, కోడింగ్, ప్రాజెక్టు ఎక్స్‌పో, డిజిటల్ పెయింటింగ్, ట్రెజర్ హంట్ పోటీలను నిర్వహించారు. కార్యక్రమంలో డైరక్టర్ (అడ్మిన్) ప్రొ.డా.దుర్గాప్రసాద్ పాడి, స్టూడెంట్స్ వ్యవహారాల డీన్ డా.రితీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
● ముగిసిన టెక్ ఉత్సవ్


