సిరిధాన్యాల పంటపై ప్రచార రథం ప్రారంభం
పర్లాకిమిడి: కాశీనగర్ బ్లాక్ కె.సీతాపురం గ్రామంలో మంగళవారం శ్రీఅర్ణఅభియాన్, మరియు ఒడిషా మిల్లెట్ మిషన్ ఆర్థిక సాయంతో సెంటర్ ఫర్ కమ్యూనిటీ డెవలప్‌మెంట్ సంస్థ (సిసిడి) రాగులు, జొన్నలు, వలిశెలు, కొర్రలు వంటి సిరిధాన్యాలపై సచేతన రథాన్ని కాశీనగర్ సమితి అధ్యక్షురాలు బల్ల శాయమ్మ జెండా ఊపి ప్రారంభించారు. కాశీనగర్ సమితిలో 11 గ్రామ పంచాయతీలు సిధ్ధ మణుగు, రాణీపేట, ఖరడ, అల్లడ, కిడిగాం, హడ్డుబంగి, పర్తాడ, ఖండవ తదితర గ్రామాల్లో జొన్న, రాగుపంటపై అవగాహన కల్పిస్తారు. ఈ ప్రచార కార్యక్రమంలో అంగన్‌వాడీ కార్యకర్తలు, వంశధార కృషి ఉత్పాదక బోర్డు సభ్యులు, సీసీడీ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.


