మందుగుండు సామగ్రి సీజ్‌ | - | Sakshi
Sakshi News home page

మందుగుండు సామగ్రి సీజ్‌

Oct 20 2025 7:25 AM | Updated on Oct 20 2025 7:25 AM

మందుగ

మందుగుండు సామగ్రి సీజ్‌

పొందూరు: పొందూరులో ఎటువంటి లైసెన్సు లేకుండా మందుగుండు సామగ్రి విక్రయిస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకుని సామగ్రి సీజ్‌ చేసినట్లు ఎస్సై వి.సత్యనారాయణ తెలిపారు. ఆదివారం మార్కెట్‌ వీధిలో దీపావళి సామాన్లు విక్రయిస్తున్నట్లు వచ్చిన సమాచారం మేరకు తనిఖీలు నిర్వహించగా రూ.1,09,623 విలువైన మందుగుండు గుర్తించామన్నారు. పొట్నూరు వెంకటరావు వద్ద రూ.40,088, జామి మణికంఠ వద్ద రూ.59,717, గుడ్ల రవి వద్ద రూ. 9,818 విలువైన సామగ్రి స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేసినట్లు చెప్పారు.

‘నాభూమి..నాదేశం’ స్మారక శిలాఫలకం కూల్చివేత

టెక్కలి: గత వైఎస్సార్‌సీపీ హయాంలో ఆజాదీకా అమృత మహోత్సవ్‌ కార్యక్రమంలో భాగంగా టెక్కలి మండలం విక్రంపురం వద్ద ఎర్ర చెరువు గట్టుపై ఏర్పాటు చేసిన ‘నాభూమి నాదేశం’ స్మారక శిలా ఫలకాన్ని కూల్చివేశారు. స్వాతంత్య్ర సమరయోధుల త్యాగానికి గుర్తుగా.. భావి తరాలకు పుడమితల్లి విలువను తెలియజేసే విధంగా.. మాతృభూమి రక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన వీరులకు గుర్తుగా ప్రతి పంచాయతీలో ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ నిధులతో వీటిని నిర్మించారు. దీనిలో భాగంగా టెక్కలి మండలం బొప్పాయిపురం పంచాయతీ విక్రంపుర వద్ద స్మారక శిలాఫలకాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పుడు దానిని కూల్చివేసి ఒక వైపు కేంద్ర ప్రభుత్వం లక్ష్యాన్ని.. మరో వైపు స్వాతంత్య్ర సమరయోధులు, వీరుల త్యాగాన్ని నేలమట్టం చేయడంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై అధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

గుర్తు తెలియని వ్యక్తి మృతి

కంచిలి: బూరగాంలో జాతీయ రహదారి పక్కన ఇటీవల మతిస్థిమితం లేని వ్యక్తి ఫిట్స్‌వచ్చి పడి ఉండగా శ్రీకాకుళం రిమ్స్‌లో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ ఈ నెల 17న మృతిచెందాడు. మృతుడి వయసు సుమారు 45 ఏళ్లు ఉండవచ్చని, గోధుమ రంగు టీ షర్టు, నలుపు ప్యాంట్‌ ధరించి ఉన్నాడని, వివరాలు తెలిస్తే కంచిలి పోలీస్‌స్టేషన్‌లో సమాచారం అందించాలని పోలీసులు కోరారు.

ఆర్జీయూకేటీలో క్విస్కిట్‌ ఫాల్‌ ఫెస్ట్‌

ఎచ్చెర్ల: ఆర్జీయూకేటీ శ్రీకాకుళం క్యాంపస్‌లో ఈ నెల 21 నుంచి 27 వ తేదీవరకూ క్విస్కిట్‌ ఫాల్‌ ఫెస్ట్‌ –2025 నిర్వహించడానికి ఏర్పాట్లు చేశామని డైరెక్టర్‌ కె.బాలాజీ తెలిపారు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో పరిశోధన అంశాలకు సంబంధించి వినియోగిస్తున్న క్వాంటమ్‌ టెక్నాలజీపై విద్యార్థులు, అధ్యాపకులకు అవగాహన కల్పించా లని ఐబీఎం క్వాంటమ్‌ సంస్థ నిర్ణయించిందని తెలిపారు. దీని కోసం కొన్ని విద్యాసంస్థలను ఎంపిక చేసి అక్కడ సదస్సులు నిర్వహించనున్నారు. నేషనల్‌ క్వాంటమ్‌ మిషన్‌లో భాగంగా డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ సహకారంతో సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు. ఈ సదస్సుకు నేరుగా నాలుగు వేల మంది విద్యార్థులు, ఆన్‌లైన్‌లో మరో ఆరువేల మంది విద్యార్థులు హాజరు కానున్నట్లు పేర్కొన్నారు. తొలిరోజు అమరావతి క్వాంటమ్‌ వ్యాలీ సలహాదారు, ఐబీఎం క్వాంటమ్‌ ఇండియన్‌ లీడర్‌ ఎల్‌. వెంకటసుబ్రహ్మణ్యం హాజరై ప్రసంగించనున్నార ని, తర్వాత 3 రోజులు పాటు దేశ, విదేశాల నుంచి వచ్చే నిపుణులు అవగాహన కల్పించనున్నారని చెప్పారు. రెండు రోజులు పాటు హ్యాకథాన్‌ నిర్వహించి, చివరి రోజు ముగింపు కార్యక్రమాన్ని నిర్వహించనున్నామన్నారు. క్యాంపస్‌లో సీఎస్‌ఈ విద్యార్థులు దూదేకుల ఖాశివంలి, కాటం నిఖిల్‌తేజ, చెరుకూరి ప్రవీణ్‌కుమా ర్‌, తృతీయ సంవత్సరం చదువుతున్న చదువుల జాన్‌బాబు, ద్వితీయ సంవత్సరం విద్యార్థి కిమిడి గుణశ్రీలు రెండేళ్ల నుంచి క్వాంటమ్‌ టెక్నాలజీపై అధ్యయనం చేస్తూ పలు సదస్సులకు హాజరయ్యా రని చెప్పారు. క్వాంటమ్‌ టెక్నాలజీకి వీరు ఆలోచనలు పంపగా ఐబీఎం సంస్థ గుర్తించి ఈ సదస్సు నిర్వహణకు ఎంపిక చేసిందని డైరెక్టర్‌ తెలిపారు.

మందుగుండు సామగ్రి సీజ్‌ 1
1/1

మందుగుండు సామగ్రి సీజ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement