
గోడ కూలి మహిళ మృతి
కొరాపుట్: కొరాపుట్, నబరంగ్‌పూర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నబరంగ్‌పూర్ జిల్లా డాబుగాం పోలీస్ స్టేషన్ పరిధిలోని జముండా గ్రామంలో గోడ కూలి రబి పనక (60) అనే మహిళ మృతి చెందింది. జయపూర్ సమితి టంకువ గ్రామ పంచాయతీ జగన్నాథపూర్–నువాగుడ మధ్య రోడ్డు బురదమయమైంది. దీంతో గ్రామం నుంచి బయటకు వెళ్లలేకపోతున్నామని గిరిజనులు తెలిపారు. మరోవైపు కొరాపుట్ జిల్లా దశమంత్‌పూర్ సమితి కేంద్రానికి వెళ్లే మార్గం పునరుద్ధరణ పనులు వేగవంతం అయ్యాయి. లక్ష్మీపూర్ నియోజకవర్గంలో వర్షాల బాధితులకు నిత్యావసరాలు పంపిణీ చేశారు.

గోడ కూలి మహిళ మృతి

గోడ కూలి మహిళ మృతి

గోడ కూలి మహిళ మృతి