
రెవెన్యూ ఉద్యోగుల నిరసన
కొరాపుట్: తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ రెవెన్యూ ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలతో సోమవారం విధులకు హాజరయ్యారు. నబరంగ్‌పూర్ జిల్లా కలెక్టరేట్ వద్ద రెవెన్యూ మినీస్ట్రీయల్ ఉద్యోగులు ఆందోళన చేశారు. ముందుగా ప్రకటించిన ప్రకారం తమ డిమాండ్లు ప్రభుత్వం నెరవేర్చనందున నల్ల బ్యాడ్జీలతో విధులకు హజరవుతున్నామని ప్రకటించారు. కొత్త పెన్షన్ విధానం రద్దు చేసి పాత విధానం అమలు చేయాలని, మరణించిన ఉద్యోగి కుటుంబంలో ఒకరికి మెరిట్ ఆధారంగా ఉద్యోగం ఇవ్వాలని, రూ. 20 లక్షల ఆరోగ్య బీమా వర్తింపజేయాలని, జిల్లా కలెక్టర్ల నివేదిక ప్రకారం కొత్త పోస్టులు సృష్టించాలని, ఖాళీలు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ల కోసం తాము పలుమార్లు ప్రభుత్వంతో జరిపిన చర్చలు విఫలమయ్యాయని గుర్తు చేశారు. ఈ నెల 14వ తేదీలోపు తమ సమస్యలపై ప్రభుత్వం స్పందించక పోతే విధులు భహిష్కరిస్తామని ఉద్యోగులు ప్రకటించారు. నిరసన కార్యక్రమంలో కలెక్టరేట్, సబ్ కలెక్టర్, తహసీల్దార్, ఐటీడీఏ, డీఆర్‌డీఏ, బీడీవో, మున్సిపల్ కార్యాలయాల సిబ్బంది హాజరయ్యా రు. సంఘం జిల్లా అధ్యక్షుడు అశుతోష్ మహంతి, ఉపాధ్యక్షుడు ధనుర్జయ మజ్జి, కై లాష్ చంద్ర పాల్గొన్నారు.