
ఒడిశాను విద్యా హబ్‌గా మార్చుతాం
కేంద్ర విద్యాలయ నూతన భవనాలకు శంకుస్థాపన
జయపురం: బహుళ ఆదివాసీ అవిభక్త కొరాపుట్‌ను విద్యా రంగంలో ఉన్నతంగా తీర్చిదిద్దుతామని కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రకటించారు. కొరాపుట్ జిల్లాలో రెండు దినాల పర్యటన సందర్భంగా ఆదివారం జయపురంలో మూడు గంటలు పర్యటించి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కొరాపుట్ నుంచి ఆయన నేరుగా జయపురం ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో గల సమగ్ర ఆదివాసి అభివృద్ధి ఏజెన్సీ విభాగ భవనాల్లో తాత్కాలిక జయపురం కేంద్ర విద్యాలయాన్ని ప్రారంభించారు. అక్కడ మొక్క నాటిన అనంతరం ఆయన విద్యాలయ అధికారులతో చర్చలు జరిపారు. అక్కడ నుంచి ఆయన విక్రమదేవ్ విశ్వవిద్యాలయానికి వెళ్లి విద్యాధికారులతో విశ్వవిద్యాలయ ప్రగతిపై చర్చలు జరిపారు. అనంతరం ఆయన జయపురం–మల్కన్‌గిరి మార్గంలో గ్లోకల్ హాస్పిటల్ సమీపంలో జయపురం కేంద్ర విద్యాలయ నిర్మాణానికి ఎంపిక చేసిన 8 ఎకరాల విశాల ప్రాంతంలో జయపురం కేంద్ర విధ్యాలయ శాశ్వత నూతన భవనాలకు భూమి పూజ చేశారు.
ఈ సందర్భంగా కేంద్ర విద్యామంత్రి ప్రసంగిస్తూ ఒడిశాను విద్యారంగంలో ఉన్నత స్థాయికి తీసుకువెళ్లేందుకు కేంద్రం కృత నిశ్చయంతో ఉందని వెల్లడించారు. ఇప్పటికే రాష్ట్రంలో ఉన్నత విద్యాసంస్థలు కేంద్రియ ఒడిశా విశ్వవిద్యాలయం, ఐఐటి భువనేశ్వర్, ఐఐఎం సంబల్‌పూర్, ఎన్‌ఐటి రూర్కెలా, కేంద్రీయ విశ్వ విద్యాలయం పూరీ, ఐఎస్‌ఎర్ బరంపురంలకు కేంఽద్రం చేయూతనిస్తోందని వెల్లడించారు. కార్యక్రమాలలో ఒడిశా రాష్ట్ర విద్యామంత్రి నిత్యానంత గోండ్, మత్య్స,పశుసంపద విభాగ మంత్రి గోకులానంద మల్లిక్, ఉన్నత విద్యామంత్రి సూర్యవంశీ సూరజ్, జయపురం ఎమ్మెల్యే తారాప్రసాద్ బాహిణీపతి, పొట్టంగి ఎమ్మెల్యే రామచంధ్ర కడమ్, కొరాపుట్ ఎమ్మెల్యే రఘునాథ్ మచ్చ, నవరంగపూర్ ఎమ్మెల్యే గౌరీశంకర మఝి, కొట్‌పాడ్ ఎమ్మెల్యే రూపు భొత్ర, నవరంగపూర్ ఎంపీ బలభధ్ర మఝి, కొరాపుట్ ఎంపీ సప్తగిరి శంకర ఉల్క, కొరాపుట్ కలెక్టర్ వి.కీర్తి వాన్, జయపురం సబ్ కలెక్టర్ కుమారి అక్కవరం శొశ్యా రెడ్డి, జయపురం కేధ్ర విద్యాలయ ప్రిన్సిపాల్ లతో పాటు పలువురు అధికారులు, బిజేపి నాయకులు, పాల్గున్నారు.
కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్

ఒడిశాను విద్యా హబ్‌గా మార్చుతాం

ఒడిశాను విద్యా హబ్‌గా మార్చుతాం