
మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలిగా మీనాక్షి బాహిణీ
కొరాపుట్: మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలిగా కొరాపుట్ జిల్లాకు చెందిన మీనాక్షి బాహిణీపతి నియమితులయ్యారు. ఆదివారం రాత్రి కొరాపుట్ ఎంపీ సప్తగిరి ఉల్క ఎక్స్ వేదికగా ప్రకటించారు. రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సూచనతో మీనాక్షిని నియమిస్తున్నట్లు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ ఎంపీ వేణుగోపాల్ ప్రకటించారు. మీనాక్షి ఈ పదవిని రెండో సారి చేపట్టనున్నారు. మీనాక్షి గతంలో కొరాపుట్ పురపాలక సంఘానికి రెండు సార్లు చైర్స్‌పర్సన్ పని చేశారు. మీనాక్షి భర్త తారా ప్రసాద్ బాహిణీపతి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిపొందారు. ప్రస్తుతం జయపూర్ ఎమ్మెల్యేగా, ప్రదేశ్ కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. మీనాక్షి మరిది భగవాన్ బాహిణీపతి గతంలో కొరాపుట్ పురపాలక సంఘ అధ్యక్షుడిగా, ఉపాధ్యక్షునిగా గెలిపొందారు. భగవాన్ ప్రస్తుతం కొరాపుట్ జిల్లా ఐఎన్‌టీయూసీ అధ్యక్షునిగా కొనసాగతున్నారు. ఈ ప్రకటనతో బాహిణీపతి కుటుంబం కాంగ్రెస్ పార్టీ ప్రబాల్యం పరిపూర్ణమైంది.