పర్లాకిమిడి: గజపతి జిల్లా భారత్ స్కౌట్స్, గైడ్స్ వింగ్‌కు అరుదైన గౌరవం దక్కింది. 2025 ఆర్థిక సంవత్సరానికిగాను రాష్ట్రపతి వార్డు వరించింది. దీన్ని ఈనెల తొమ్మిదో తేదీన ఒడిశాలోని రాజభవన్‌లో హాల్‌లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ హరిబాబు కంభంపాటి అందజేశారు. గజపతి జిల్లా స్కౌట్స్, గైడ్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న భారత్ స్కౌట్స్ ఆఫీసర్ సురేంద్రకుమార్ పాత్రో, డీఈవో డాక్టర్ మాయాధర్ సాహులు రాష్ట్రపతి ఆవార్డును అందుకున్నారు. రాష్ట్రపతి ఆవార్డు ప్రదాన కార్యక్రమంలో గవర్నర్ సతీమణి జయంతీ కంభంపాటితో పాటు రాష్ట్ర ఉన్నతవిద్యాశాఖ మంత్రి సూర్యవంశీ సూరజ్, విద్యాలయ గణశిక్షామంత్రి నిత్యానంద గోండ్, రాష్ట్ర ముఖ్యకమిషనర్ కాళీప్రసాద్ మిశ్రో, దేవీప్రసాద్ పట్నాయక్ తదితరులు పాల్గొన్నారు. గజపతి జిల్లాకు రాష్ట్రపతి పురస్కారం రావడం ఇది మూడోసారని డీఈవో డాక్టర్ మాయాధర్ సాహు తెలిపారు.