
జమిలి ఎన్నికలతో ప్రజాధనం వృథా కాదు
కొరాపుట్: జమిలి ఎన్నికలతో ప్రజా ధనం వృథా కాదని నబరంగ్‌పూర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు కుంజ బీహారి దాస్ అన్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో సోమవారం జరిగిన వన్ నేషన్–వన్ ఎలక్షన్ అనే అంశంపై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. ఈ విధానం అమలైతే మధ్యంతర ఎన్నికలు రావన్నారు. పదే పదే ఎన్నికల కోడ్ వలన ప్రజా పాలనకు అడ్డంకి అవుతుందని గుర్తు చేశారు. ఒకే సారి ఎన్నికలతో దేశ వ్యాప్తంగా ఐదేళ్ల పాటు రాజకీయాలు ఉండవని కుంజదాస్ పేర్కొన్నారు. సమావేశంలో పార్టీ పరిశీలకులు సౌమ్యకాంత్ జెన్నా, రాజేష్ కుమార్ పట్నాయక్, చాంబర్ ఆప్ కామర్స్ ప్రెసిడెంట్ కను దాస్, పార్టీ నాయకులు మృత్యుంజయ్ దాస్, దేవదాస్ మహాంకుడో, జగదీష్ బిసోయి ఉన్నారు.

జమిలి ఎన్నికలతో ప్రజాధనం వృథా కాదు