రాయగడ: రాయగడ నుంచి ఆంధ్రకు వెళ్లే ప్రధాన రహదారి మజ్జిగౌరి మందిర సమీపంలో ఉన్న వంతెనను లారీ ఢీకొనడంతో ఈ మార్గంలో రాకపొకలు నిలిచిపోయాయి. సోమవారం ఛత్తీస్‌ఘడ్ నుంచి ఆంధ్ర వైపు బొగ్గు లోడుతో వెళ్లున్న లారీ వంతెన మలుపులో అదుపుతప్పి ఢీకొంది. శనివారం ఆంధ్ర నుంచి రాయగడ మీదుగా వచ్చిన లారీ వంతెన మధ్యలో మరమ్మతులకు గురై నిలిచిపోవయింది. చిన్న మార్గం కావడంతో రకాపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇంతవరకు ఆ లారీని వేరే ప్రాంతానికి తరలించకపొవడంతోపాటు వంతెన మలుపు వద్ద లారీ ఢీకొని ఉండి పోవడంతో ట్రాఫిక్ పూర్తిగా స్థంభించిపొయింది. పోలీసులు చొరవ తీసుకుని రాయగడ మీదుగా ఆంధ్ర వైపు వెళ్లే భారీ వాహనాలను వ్యూ పాయింట్ మీదుగా వెళ్లేలా మరలించడంతో కొంతమేర సమస్య కొలిక్కి వచ్చింది. తరచూ ఈ వంతెన వద్ద ఇటువంటి సమస్యలు తలెత్తుతుండటంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
వంతెనను ఢీకొట్టిన లారీ