భువనేశ్వర్: దేశంలో నియోజకవర్గాల పునర్విభజనపై రాజకీయ వర్గాల్లో కొత్త సమీకరణాలు రూపుదిద్దుకుంటున్నాయి. సమగ్ర ప్రయోజనకర ప్రామాణికత ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజనని న్యాయసమ్మతంగా నిర్వహించాలని పలు రాజకీయ వర్గాలు ఒత్తిడి తెస్తున్నాయి. పునర్విభజనతో దేశంలో లోక్‌సభ స్థానాల సంఖ్య పెరుగుతాయి. అలాగే లోక్‌సభ సీట్లు ఆధారంగా ఽశాసన సభ స్థానాల సంఖ్య కూడా పెరుగుతాయనే చర్చ జరుగుతోంది. తదనుగుణంగా చట్ట సభల్లో ప్రజాప్రతినిధుల సంఖ్య కూడా పెరుగుతుంది. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రక్రియను ప్రారంభించడంతో పలు రాష్ట్రాలు న్యాయ సమ్మతమైన ప్రామాణికత కోసం పట్టుబడుతున్నాయి. ప్రధానంగా దక్షిణాది రాష్ట్రాలు ఈ దిశలో బలంగా వ్యతిరేకిస్తున్నాయి. ఒక జాతీయ సంస్థ అంచనా ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన తర్వాత దేశంలో పార్లమెంటరీ నియోజకవర్గాల సంఖ్య 848కి చేరుకుంటుంది. రాష్ట్రాల్లో శాసనసభ నియోజకవర్గాల సంఖ్య కూడా పెరుగుతుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 21 లోక్ సభ స్థానాలు ఉన్నాయి. వీటి సంఖ్య 28కి చేరుకుంటుందని అంచనా.
జనాభా ప్రామాణికతపై వ్యతిరేకత
జనాభా ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజనపై తీవ్ర వ్యతిరేకత నెలకొంది. దేశాభివృద్ధికి భారత ప్రభుత్వ ప్రేరణతో జనాభా నియంత్రణకు తోడ్పడిన రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిత నియోజకవర్గాల పునర్విభజనతో తీరని నష్టం వాటిళ్లుతుందని రాష్ట్రంలోని విపక్ష నేత, బిజూ జనతా దళ్ అధ్యక్షుడు నవీన్ పట్నాయక్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ దిశలో న్యాయసమ్మత పునర్విభజన శీర్షికతో తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ ఆధ్వర్యంలో శనివారం చైన్నెలో జరిగిన సంయుక్త క్రియాశీలక సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంటుందని అభినందించారు. దేశ జనాభా నియంత్రణకు సుస్థిర కార్యాచరణతో తోడ్పడిన రాష్ట్రాల్లో నివసిస్తున్న ప్రజల హక్కులను నిర్ధారించడానికి ఈ సమావేశం ప్రధాన వేదికగా నిలుస్తుందన్నారు. దేశ జనాభా నియంత్రణలో ఒడిశా, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, పశ్చిమ బెంగాల్, పంజాబ్ వంటి రాష్ట్రాలు విశేషంగా పాలుపంచుకున్నాయన్నారు. జనాభాను స్థిరీకరించడంలో సాఫల్యత సాధించిన రాష్ట్రాలకు జనాభా ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన పెను విస్ఫోటనంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనివలన ఆయా రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. తాజా జనాభా గణాంకాలు పరిగణనలోకి తీసుకుంటే ఒడిశా రాష్ట్రం భారీ నష్టానికి గురవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆశయం నెరవేరాలి
1971 జనాభా లెక్కల ఆధారంగా పార్లమెంటరీ నియోజకవర్గాలను మరో 25 ఏళ్ల పాటు పొడిగించాలని సంయుక్త క్రియాశీలక కమిటీ సమావేశంలో తీర్మానించారు. శనివారం చైన్నెలో న్యాయసమ్మత పునర్విభజన శీర్షిక సమావేశం తర్వాత ఆమోదించిన తీర్మానంపై కనిమొలి మాట్లాడుతూ భారత రాజ్యాంగం 42, 84, 87వ సవరణల లక్ష్యం వెనుక ఉద్దేశం జనాభా స్థిరీకరణగా పేర్కొన్నారు. ఇంకా ఈ లక్ష్యం నెరవేరలేదని తెలిపారు. 1971 జనాభా లెక్కల ఆధారంగా పార్లమెంట్ నియోజకవర్గాల స్తంభనను అవసరమైన సవరణల ద్వారా మరో 25 సంవత్సరాలు పొడిగించాలని సంయుక్త క్రియాశీలక కమిటీ (జేఏసీ) తీర్మానించింది.
నియోజకవర్గాల పునర్విభజనపై వ్యతిరేకత
జనాభా ప్రాతిపదికన
సరికాదంటున్న పార్టీలు
జనాభా నియంత్రణకు
ప్రాధాన్యమేదని ప్రశ్న
దిగజారిన సంతానోత్పత్తి రేటు
గత కొన్నేళ్లుగా రాష్ట్రంలో సమగ్ర సంతానోత్పత్తి రేటు (టీఎఫ్‌ఆర్) గణనీయంగా తగ్గుముఖం పట్టింది. దేశ సమగ్ర అభివృద్ధి కార్యాచరణలో భాగస్వామిగా పాలుపంచుకున్న ఒడిశాకు జనాభా ప్రామాణికతతో నియోజకవర్గాలను పునర్విభజిస్తే తీరని అన్యాయం ఎదురవుతుంది. 1971 నుంచి లోక్‌సభలో 543 స్థానాలు, రాష్ట్ర శాసనసభలో 147 స్థానాలు ఉన్నాయి. 1971 సంవత్సరంలో రాష్ట్ర సమగ్ర సంతానోత్పత్తి రేటు (టీఎఫ్‌ఆర్) దాదాపు 4 కాగా, వర్ధమాన పరిస్థితుల్లో టీఎఫ్‌ఆర్ 2 కంటే తక్కువగా దిగజారింది. 2019లో రాష్ట్ర సమగ్ర సంతానోత్పత్తి రేటు దాదాపు 1.8గా నమోదు అయింది. అందువల్ల జనాభాను మాత్రమే నియోజకవర్గాల పునర్విభజనకు ఏకై క కొలమానంగా పరిగణిస్తే జనాభా పెరుగుదలను సమర్దవంతంగా అరికట్టలేని రాష్ట్రాలతో పోల్చితే రాష్ట్రానికి అపార నష్టం వాటిళ్లుతుంది.
దక్షిణాదికి అన్యాయం..!