విజయనగరం గంటస్తంభం:
ప్రముఖ పాత్రికేయుడు, సినీ మాటల రచయిత కె.ఎన్.వై.పతంజలి 73వ జయంతి సందర్భంగా హైదరాబాద్‌కు చెందిన పాత్రికేయుడు, పతంజలితో పాతికేళ్ల పాటు కలిసి పనిచేసిన రచయిత తాడి ప్రకాష్‌కు పతంజలి పురస్కారం అందజేయనున్నట్టు పతంజలి సాంస్కృతిక వేదిక అధ్యక్షుడు భీశెట్టి బాబ్జి తెలిపారు. గురజాడ అప్పారావు గృహంలో వేదిక ప్రతినిధులతో కలిసి శుక్రవారం విలేకరులతో మాట్లాడారు.
ఏటా పతంజలి జయంతి సందర్భంగా ప్రముఖులకు పురస్కారం అందజేస్తున్నామన్నారు. 2025 సంవత్సరానికి గాను తాడి ప్రకాష్‌కు ఈ నెల 29 తేదీన గురుజాడ గ్రంథాలయంలో పురస్కారం ప్రదానం చేస్తామని చెప్పారు. సాహిత్య అభిమానులు, రచయితలు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో వేదిక కార్యదర్శి బాబు, లక్ష్మణరావు, పౌరవేదిక ప్రతినిధులు పాల్గొన్నారు.