రాయగడ: ప్రజలకు శుభాలు చేకూర్చే మా మంగళ అమ్మవారి దేవతా మూర్తిని 35 ఏళ్ల క్రితం స్థానిక రింగ్ రోడ్డులో ఆ ప్రాంతవాసులంతా ప్రతిష్టించి మందిర నిర్మాణం చేపట్టారు. నిత్యపూజలు విశేష కార్యక్రమాలతో ఎంతో ప్రాచుర్యం పొందిన ఈ ఆలయాన్ని ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వ దేవదాయ శాఖ గుర్తించింది. ఈ సందర్భంగా తొలిసారిగా మందిర ట్రస్ట్ ఏర్పాటు చేశారు. అధ్యక్షుడిగా స్థానిక రాజేంద్ర కుమార్ సాహుని నియమిస్తూ ఆ శాఖ ఉత్తర్వులను జారీ చేసింది. గురువారం ఆలయ ప్రాంగణంలో అధ్యక్షుడిగా నియమితులైన సాహు బాధ్యతలు స్వీకరించారు. ఈయనతో పాటు మరో పదిమంది ట్రస్ట్ సభ్యులను నియమిస్తున్నట్లు ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్యుల్లో పేర్కొన్నారు. వీరిలో ప్రముఖ న్యాయవాది బినాయక్ కర్, రామకృష్ణ పండా, గొపినాథ్ గౌడొ, రవీంద్ర సాహు, మంజూశ్రీ ముఖార్జి, పుష్పభాను దాస్, నరేష్ పట్నాయక్, రామనాఽథ్ పురొహిత్, రంజిత్ బిసోయి, లలిత్ జెన్న ఉన్నారు. మందిర ప్రాంగణంలో బాధ్యతలు చేపట్టిన ట్రస్ట్ సభ్యులకు స్థానికులు అభినందించారు.
మా మంగళ మందిరానికి ప్రభుత్వ గుర్తింపు
మా మంగళ మందిరానికి ప్రభుత్వ గుర్తింపు