
బొబ్బిలి రూరల్: మండలంలోని గొర్లెసీతారాంపురం అప్పయ్యచెరువులో మంగళవారం గుర్తుతెలియని మహిళ (45) మృతదేహాన్ని స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఈ మేరకు ఎస్సై చదలవాడ సత్యనారాయణ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. సమాచారం మేరకు సీఐ ఎం.నాగేశ్వరరావు సిబ్బందితో వెళ్లి, మృతదేహాన్ని పరిశీలించి వెలికితీయించారు. మృతురాలి శరీరంపై ఎలాంటి గాయాలు లేకపోవడంతో అనుమానాస్పద మృతిగా కేసునమోదు చేశారు. కాగా మృతురాలిని బాడంగి మండలం పెద్దపల్లికి చెందిన మహిళగా కొందరు భావిస్తున్నారు. స్థానికంగా ఎలాంటి ఫిర్యాదులు రాలేదని, కేసునమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.