స్వయం ఉపాధి కోర్సులను సద్వినియోగం చేసుకోవాలి
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): జనశిక్షణ సంస్థాన్ ద్వారా అందిస్తున్న వివిధ స్వయం ఉపాధి కోర్సుల్లో నిరుద్యోగ యువతీ యువకులు శిక్షణ తీసుకుని తమ నైపుణ్యాలను పెంపొందించుకోవడం ద్వారా ఉపాధి పొందొచ్చని ఎన్టీఆర్ జిల్లా నైపుణ్యాభివృద్థి అధికారి ఎస్.శ్రీనివాసరావు సూచించారు. మొగల్రాజపురంలోని జనశిక్షణ సంస్థాన్ కార్యాలయం ఆవరణలో కెపాసిటీ బిల్డిం పోగ్రామ్ బుధవారం జరిగింది. ఎస్.శ్రీనివాసరావు మాట్లాడుతూ.. జనశిక్షణ సంస్థాన్ నేటి అవసరాలకు తగినట్లుగా యువతకు స్వయం ఉపాధి కోర్సుల్లో శిక్షణ ఇవ్వడం అభినందనీయమన్నారు. జిల్లా పరిశ్రమల కేంద్రం ఇండస్ట్రీయల్ ప్రమోషనల్ ఆఫీసర్ (ఐపీఓ) కె.రవికుమార్ మాట్లాడుతూ.. స్వయం ఉపాధి కోర్సుల్లో శిక్షణ తీసుకున్న యువకులు ప్రభుత్వ ప్రోత్సాహకాలపై అవగాహన పెంచుకుని కుటీర, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు స్థాపించి మరికొందరికి ఉపాధి చూపొప్చని పేర్కొన్నారు. జనశిక్షణ సంస్థాన్ చైర్‌పర్సన్ ఎన్.విదాకన్నా, డైరెక్టర్ ఎ.పూర్ణిమ పాల్గొన్నారు.


