పొట్టి శ్రీరాములు త్యాగం మరువలేనిది
లబ్బీపేట(విజయవాడతూర్పు): భాషా ప్రయుక్త రాష్ట్రాల కోసం 58 రోజుల పాటు ఆమరణదీక్ష చేసి ప్రాణాలు అర్పించిన పొట్టి శ్రీరాములు త్యాగం మరువలేనిదని పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు అన్నారు. పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా తన కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీపీ రాజశేఖరబాబు మాట్లాడుతూ.. పొట్టి శ్రీరాములు సేవలు మరవలేనివని, ఆయన ఆశయాలను, సేవలను స్ఫూర్తిగా చేసుకొని విధుల్లో పునరంకితం అవుదామన్నారు.
డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో..
అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి డీఎంహెచ్‌ఓ డాక్టర్ మాచర్ల సుహాసిని పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం తన ప్రాణాన్ని ఫణంగా పెట్టి ఆత్మార్పణ చేసిన మహనీయులన్నారు. ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పలువురు వైద్యులు పాల్గొన్నారు.


