కరుణించమ్మా.. కనకదుర్గమ్మా | - | Sakshi
Sakshi News home page

కరుణించమ్మా.. కనకదుర్గమ్మా

Dec 15 2025 6:54 AM | Updated on Dec 15 2025 6:54 AM

కరుణి

కరుణించమ్మా.. కనకదుర్గమ్మా

కరుణించమ్మా.. కనకదుర్గమ్మా ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): కరుణించు.. కనకదుర్గమ్మా అంటూ దీక్ష విరమణలకు వచ్చిన భవానీలు మనసారా ప్రార్థించారు. దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానంలో జరుగుతున్న భవానీ దీక్ష విరమణలు కీలక దశకు చేరుకున్నాయి. ఆదివారం పెద్ద సంఖ్యలో భవానీలు అమ్మవారిని దర్శించుకుని ఇరుముడులు సమర్పించారు. శనివారం అర్ధరాతిర ఒంటిగంటకు దర్శనానికి భవానీలను అనుమతించారు. రద్దీ ఎక్కువగా ఉండటంతో వినాయకుడి గుడి నుంచి సీతమ్మ వారి పాదాల వద్ద హోల్డింగ్‌ పాయింట్లు, వీఎంసీ కార్యాలయం వద్ద హోల్డింగ్‌ పాయింట్లలోకి మళ్లించారు. దీక్ష విరమణలో నాలుగో రోజైన ఆదివారం అత్యధికంగా ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన భవానీలు ఆలయానికి తరలివచ్చారు. విశాఖపట్నం, విజయనగరం, అరకు, విజయనగరం, శ్రీకాకుళం ప్రాంతాలకు చెందిన భక్తులు, భవానీలు ఇంద్రకీలాద్రికి వచ్చారు. ఏటా దీక్ష విరమణల్లో చివరి రోజు వస్తామని అయితే ఈ ఏడాది ఒక రోజు ముందుగానే అమ్మ దర్శనానికి విచ్చేశామని పలువురు ఉత్తరాంఽధ్రవాసులు పేర్కొంటున్నారు. భవానీ దీక్ష విరమణ ఏర్పాట్లను ఆదివారం దేవదాయ శాఖ కమిషనర్‌ రామచంద్రమోహన్‌ పరిశీలించారు. మూడో రోజు శనివారం మొత్తం 1.20 లక్షల మంది భవానీలు, భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారని ఆలయ అధికారులు పేర్కొంటున్నారు. మూడో రోజున 5 లక్షల లడ్డూలను విక్రయించగా, 13 వేల మంది భవానీలు తలనీలాలను సమర్పించారు. సోమవారం ఉదయం 10.30 గంటలకు యాగశాలలో మహా పూర్ణాహుతి చేయడానికి వైదిక కమిటీ నిర్ణయించింది. మహా పూర్ణాహుతితో విరమణలు పరిసమాప్తమవుతాయని, సాయంత్రం వరకు దీక్షలను విరమించవచ్చునని ఆలయ వైదిక కమిటీ పేర్కొంది. అమ్మవారికి సమర్పించిన కానుకలను ఈ నెల 17, 18 తేదీల్లో లెక్కించనున్నారు. విరమణలు సోమవారం ముగియనుండటంతో ఆర్జిత సేవల టికెట్లను ఎప్పటి నుంచి విక్రయించాలనే దానిపై సోమవారం తేలే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు.

నాలుగో రోజు ఆదాయం రూ. 81.58 లక్షలు

దీక్షల విరమణకు తరలివచ్చిన

ఉత్తరాంధ్రవాసులు

నేడు మహా పూర్ణాహుతి

అత్యధికం ఉత్తరాంధ్రవాసులే

ఏర్పాట్ల పరిశీలన

పూర్ణాహుతితో సమాప్తం

17,18 తేదీల్లో కానుకల లెక్కింపు

చిత్రం.. భళారే విచిత్రం

విజయవాడ కల్చరల్‌: ఏపీ సృజనాత్మక సమితి, తెలుగు ప్రపంచ చిత్రకారుల సమాఖ్య ఆధ్వర్యాన పున్నమ్మ తోటలోని దూరదర్శన్‌, టీటీడీ కల్యాణమండపం రోడ్డులో నిర్వహించిన చిత్ర కళాప్రదర్శన ఆకట్టుకుంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన చిత్రకారులు వారి చిత్రాలను ప్రదర్శించారు. 200 స్టాల్స్‌లో ప్రదర్శించిన చిత్రాలు కనువిందు చేశాయి. ఆధునిక చిత్రకళ ఉట్టిపడేలా గ్రామీణ జీవనం, రైతులు, ప్రకృతి సౌందర్యం, పల్లెజీవితం, జాతీయ నాయకులు, దేవతా మూర్తులు తదితర అంశాలతో కూడిన చిత్రాలను ప్రదర్శించారు. ఉదయం 9 గంటలకు ప్రారంభమైన చిత్ర కళాప్రదర్శన రాత్రి 9 గంటలవరకు సాగింది. ప్రపంచ తెలుగు చిత్రకళా సమాఖ్య అధ్యక్షుడు పీరన్‌, కార్యదర్శి బాలయోగి, టి.వెంకటర్రావ్‌ తదితరులు పాల్గొన్నారు.

ప్రజలకు అవగాహన కల్పించడానికే..

ప్రజలకు అవగాహన కల్పించాలనే ఆశయంతో చిత్ర కళా ప్రదర్శన ఏర్పాటు చేసినట్లు అధ్యక్షుడు పీరన్‌ తెలిపారు. బాల చిత్రకారులకు ఇటువంటి వేదికలు అవసరమన్నారు. అమరావతి కేంద్రంగా కళాకారుల ప్రదర్శనకు ఆడిటోరియం నిర్మించాలని సూచించారు. నిర్వాహకులు శిబిరంలో పాల్గొన్న చిత్రకారులకు ప్రశంసాపత్రాలను అందజేశారు.

దీక్ష విరమణల నేపథ్యంలో నాలుగో రోజు దేవస్థానానికి రూ. 81.58 లక్షల మేర ఆదాయం సమకూరిందని ఆలయ అధికారులు పేర్కొన్నారు. నాలుగో రోజైన ఆదివారం సాయంత్రం 6 గంటల వరకు 1.18 లక్షల మంది అమ్మవారిని దర్శించుకోగా, లడ్డూ ప్రసాదాల విక్రయం ద్వారా రూ. 76.21 లక్షల మేర ఆదాయం సమకూరిందన్నారు. సుమారు 5 లక్షల లడ్డూలను విక్రయించిగా, అన్నదానం, అల్పాహారాన్ని 26,586 మందికి అందజేసినట్లు పేర్కొన్నారు. అమ్మవారికి 13,200 మంది తల నీలాలను సమర్పించగా, రూ. 5.28లక్షల మేర ఆదాయం లభించిందని అధికారులు తెలిపారు.

కరుణించమ్మా.. కనకదుర్గమ్మా 1
1/2

కరుణించమ్మా.. కనకదుర్గమ్మా

కరుణించమ్మా.. కనకదుర్గమ్మా 2
2/2

కరుణించమ్మా.. కనకదుర్గమ్మా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement