పతకాల వీరుడు @59 | - | Sakshi
Sakshi News home page

పతకాల వీరుడు @59

Dec 15 2025 6:54 AM | Updated on Dec 15 2025 6:54 AM

పతకాల

పతకాల వీరుడు @59

అనారోగ్య పరిస్థితులు లేవు

సాధించిన పతకాలు ఇవి..

ఆర్టీసీలో మెకానిక్‌ రామకృష్ణ

59 ఏళ్లలోనూ పాల్గొంటే పతకాలే

ఇప్పటి వరకు 225 పైగా

బహుమతులు కై వసం

హైస్కూలు స్థాయి నుంచి మాస్టర్స్‌

అథ్లెటిక్స్‌ వరకు పతకాల పంట

ఆటోనగర్‌(విజయవాడతూర్పు): ఆయన ఆర్టీసీలో మెకానిక్‌. 59 ఏళ్ల ప్రాయంలోనూ ఆటల పోటీలంటే అత్యంత ఆసక్తి చూపుతున్నారు. ఆటల్లో సత్తా చాటి క్రీడా కోటాలో ఆర్టీసీ ఉద్యోగం సాధించారు బంటుమిల్లి మండలం ఆముదాలపల్లికి చెందిన పి.రామకృష్ణ. ఆయన ఇప్పటి వరకు 225 పైగా బంగారు, వెండి, కాంస్య పతకాలు సాధించారు.

మొదటి బహుమతితో క్రీడా కోటాలో..

రామకృష్ణకు రన్నింగ్‌, సైక్లింగ్‌, యోగా అంటే మక్కువ. పాఠశాల స్థాయిలోనే ప్రావీణ్యం చూపారు. 1988లో హైదరాబాద్‌లో జరిగిన రాష్ట్ర స్థాయి మారథాన్‌ 42.195 కిలోమీటర్ల విభాగంలో (రన్నింగ్‌ 3.28 గంటలు) ప్రథమ స్థానం సాధించారు. ఐటీఐ చదివిన ఆయన ఈ సర్టిఫికెట్‌తో 1991లో ఆర్టీసీ అవనిగడ్డ డిపోలో మెకానిక్‌గా ఉద్యోగంలో చేరారు. ఇలా ఇబ్రహీంపట్నం, గవర్నర్‌పేట, గుడివాడ డిపోల్లో చేసి ప్రస్తుతం ఆటోనగర్‌లో విధులు నిర్వహిస్తున్నారు. ఒకవైపు ఉద్యోగ బాధ్యతను నెరవేరుస్తూ.. మరోవైపు రన్నింగ్‌లో పతకాలు సాధించి ఆర్టీసీకి, జిల్లాకు ఖ్యాతి తెస్తున్నారు.

నాటి నుంచి ఇప్పటి వరకు..

హైస్కూల్‌ స్థాయిలోనే కాకుండా ప్రస్తుతం మాస్టర్‌ అథ్లెటిక్స్‌ పోటీల్లో అత్యుత్తమ ప్రతిభను కనపరుస్తున్నారు. ఎన్నోపతకాలను సొంతం చేసు కుంటున్నారు. ఆయన పాల్గొంటే కచ్చితంగా పతకం సాధించడమే.

యువతకు శిక్షణ

ఉద్యోగం చేస్తూనే జిల్లాలో యువకులకు నడక, యోగా, రన్నింగ్‌లో శిక్షణ ఇస్తున్నారు. ఇలా శిక్షణ పొందిన వారిలో పలువురికి పోలీసు, ఇతర శాఖల్లో ఉద్యోగాలు వచ్చినట్టు రామకృష్ణ చెబుతున్నారు.

నాకు 59 సంవత్సరాలు . ఎలాంటి అనారోగ్య పరిస్థితులు లేవు. ఇప్పటి వరకు 50 బంగారు పతకాలు, 100 వెండి, 75 కాంస్య పతకాలు సాధించాను. కొన్నేళ్ల నుంచి కానూరులోని సిద్ధార్థ కాలేజీలో యువకులకు, మధ్య వయసు వారికి నిత్యం రన్నింగ్‌, యోగా, సైక్లింగ్‌లో శిక్షణ ఇస్తున్నాను. గతంలో శిక్షణ పొందినవారు పోలీసు, ఇతర శాఖల్లో ఉద్యోగాలు చేస్తున్నారు.

–పి.రామకృష్ణ,

ఆర్టీసీ మెకానిక్‌, ఆటోనగర్‌ డిపో

1988, 1993, 98, 2000, 2006, 2009, 2010, 2011 వరకు జరిగిన మారథాన్‌ రన్నింగ్‌లో బంగారు పతకాలు సాధించారు. 2025లో ఇటీవల నవంబరులో జరిగిన పరుగు పందాల్లో మూడో స్థానం పొందారు. ఈ నెలలో జరిగిన 44వ రాష్ట్ర స్థాయి మాస్టర్‌ అధ్లెటిక్స్‌ పోటీల్లో మూడు బంగారు పతకాలు సాధించారు. అనేక పోటీల్లో వెండి, కాంస్య పతకాలు సాధించారు.

పతకాల వీరుడు @591
1/2

పతకాల వీరుడు @59

పతకాల వీరుడు @592
2/2

పతకాల వీరుడు @59

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement