తుఫాన్ ప్రభావంతో పలు రైళ్ల రద్దు
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): తుఫాన్ ప్రభావంతో ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని విజయవాడ డివిజన్ ముందస్తు భద్రతా చర్యలు చేపట్టింది. అందులో భాగంగా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల మీదుగా నడిచే పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు విజయవాడ డివిజన్ పీఆర్వో నుస్రత్ మండ్రుప్కర్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు.
నేడు రద్దయిన రైళ్లు..
ఈ నెల 28న విజయవాడ–భీమవరం టౌన్(67281), భీమవరం టౌన్–నిడదవోలు(67283), నిడదవోలు–భీమవరం టౌన్(67284), భీమవరం టౌన్–విజయవాడ(67282), గుంటూరు–విజయవాడ(67230), విజయవాడ–కాకినాడ పోర్టు(17257), విజయవాడ–తెనాలి(67221), తెనాలి–రేపల్లె(67231), రేపల్లె–తెనాలి (67232), తెనాలి–రేపల్లె(67233), రేపల్లె–గుంటూరు(67234), గుంటూరు–తెనాలి(67237), విజయవాడ–మచిలీపట్నం(67265), మచిలీపట్నం–గుడివాడ(67271), గుడివాడ–మచిలీపట్నం(67272), విజయవాడ–నర్సాపూర్(67258), నర్సాపూర్–రాజమండ్రి(67246), విజయవాడ–రాజమండ్రి(67202), విజయవాడ–ఒంగోలు(67273), ఒంగోలు–విజయవాడ(67267), నర్సాపూర్–విజయవాడ(67276), భీమవరం టౌన్–నిడదవోలు(67277), నిడదవోలు–భీమవరం టౌన్(67278), నర్సాపూర్–గుంటూరు(67247), మచిలీపట్నం–విజయవాడ(67256), విజయవాడ–నర్సాపూర్(67257), విజయవాడ–మాచర్ల(67227), రాజమండ్రి–విజయవాడ(67201), రాజమండ్రి–విశాఖపట్నం(67285), విశాఖపట్నం–రాజమండ్రి(67286), కాకినాడ పోర్టు–విశాఖపట్నం(17267), విశాఖపట్నం–కాకినాడ పోర్టు(17268) రైళ్లు రద్దు చేశారు.
29న రద్దు చేసిన రైళ్లు..
గుంటూరు–విజయవాడ(67230), మచిలీపట్నం–విజయవాడ(67266), విజయవాడ–మచిలీపట్నం(67269), భీమవరం టౌన్–నర్సాపూర్(17263), గుంటూరు–రేపల్లె(67249), రేపల్లె–గుంటూరు(67250), నర్సాపూర్–నిడదవోలు(67244), నిడదవోలు–నర్సాపూర్(67245), మాచర్ల–విజయవాడ(67228), రాజమండ్రి–విజయవాడ(67261), రాజమండ్రి–భీమవరం టౌన్(67242), నిడదవోలు–నర్సాపూర్(67243), కాకినాడ పోర్టు–విజయవాడ(17258) రైళ్లు ఈ నెల 29న పూర్తిగా రద్దు చేశారు.
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): నేషనల్ సైన్స్ ఎగ్జిబిషన్ – 2025కు ఎన్టీఆర్ జిల్లా నుంచి రెండు ప్రాజెక్ట్‌లు ఎంపికై నట్లు జిల్లా పాఠశాల విద్యాశాఖాధికారి యూవీ సుబ్బారావు తెలిపారు. భోపాల్‌లో నవంబర్ 18 నుంచి 23వ తేదీ వరకూ ఈ ఎగ్జిబిషన్ జరుగుతుందన్నారు. ప్రదర్శనకు జిల్లాలోని ఏపీ మోడల్ స్కూల్ (గంపలగూడెం మండలం), జీవీజే జెడ్పీ హైస్కూల్(బాలురు) జగ్గయ్యపేటకు విద్యాసంస్థలకు చెందిన ప్రదర్శించిన ప్రాజెక్ట్‌లు ఎగ్జిబిషన్‌కు ఎంపికై నట్లు చెప్పారు.


