మిర్చి యార్డుకు సెలవులు
కొరిటెపాడు(గుంటూరు): మోంథా తుఫాన్ హెచ్చరికల నేపథ్యం, ఉన్నతాధికారుల సూచనల మేరకు ముందస్తు జాగ్రత్త చర్యగా గుంటూరు మార్కెట్ యార్డుకు మంగళ, బుధవారాలు సెలవులు ప్రకటించినట్టు యార్డు ఉన్నతశ్రేణి కార్యదర్శి ఎ.చంద్రిక సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. సెలవు రోజుల్లో యార్డులో క్రయ, విక్రయాలు జరగబోవని వెల్లడించారు. రైతులు సెలవు రోజుల్లో తమ మిర్చిని యార్డుకు తీసుకురావద్దని కోరారు.
జి.కొండూరు: ఇంట్లో ఎవరూలేని సమయంలో బంగారు ఆభరణాలను చోరీ చేసిన ఘటన జి.కొండూరులో ఆదివారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. స్థానిక పీఏసీఎస్ బ్యాంకు సమీపంలో నివాసం ఉంటున్న కుక్కల శ్రీనివాసరావు కుటుంబం ఆదివారం ఉదయం 6 గంటలకు ఇంటికి తాళం వేసి తాళం చెవిని పక్కనే ఉన్న కిటికీలో పెట్టి వ్యవసాయ పనుల నిమిత్తం పొలానికి వెళ్లారు. ఈ సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు ఇంట్లోకి చొరబడి ఇనుప బీరువాలో ఉన్న నాలుగు గ్రాముల బంగారు బ్రాస్‌లేట్, 1.5 గ్రాముల చెవి దిద్దులను ఎత్తుకెళ్లారు. పొలం నుంచి ఇంటికి తిరిగివచ్చిన శ్రీనివాసరావు కుటుంబ సభ్యులు ఇంట్లో చోరీ జరిగిందని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సతీ ష్‌కుమార్ తెలిపారు.


