జీజీహెచ్‌లో దివీస్‌ ఆర్‌ఓ వాటర్‌ ప్లాంట్లు | - | Sakshi
Sakshi News home page

జీజీహెచ్‌లో దివీస్‌ ఆర్‌ఓ వాటర్‌ ప్లాంట్లు

Oct 24 2025 8:06 AM | Updated on Oct 24 2025 8:06 AM

జీజీహ

జీజీహెచ్‌లో దివీస్‌ ఆర్‌ఓ వాటర్‌ ప్లాంట్లు

జీజీహెచ్‌లో దివీస్‌ ఆర్‌ఓ వాటర్‌ ప్లాంట్లు కళారూపాల్లో ప్రావీణ్యం సాధించాలి డిసెంబర్‌ 15 నుంచి తిరుపతమ్మ మండల దీక్ష పవర్‌ లిఫ్టింగ్‌ టైటిల్‌ విన్నర్‌గా రైల్వే ఉద్యోగి

లబ్బీపేట(విజయవాడతూర్పు): దివీస్‌ లేబొరేటరీస్‌ తమ సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో రోగులు, అటెండెంట్‌ల కోసం ఆర్‌ఓ ప్లాంట్‌లు ఏర్పాటు చేసింది. న్యూ జీజీహెచ్‌లో రూ.66.67 లక్షలు వెచ్చించి గంటకు 1000 లీటర్ల సామర్ధ్యం ఉన్న 3 ఆర్‌ఓ ప్లాంట్లు, గంటకు 100 లీటర్ల సామర్ధ్యం కల 11 ఆర్‌ఓ ప్లాంట్‌లను వితరణగా అందజేసింది. వాటిని గురువారం ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ఎ. వెంకటేశ్వరరావుతో కలిసి తూర్పు ఎమ్మెల్యే గద్దే రామ్మోహన్‌ లాంఛనంగా ప్రారంభించారు. ఆస్పత్రికి వచ్చే రోగులు, సిబ్బందికి శుద్ధమైన తాగునీరు అందించేందుకు ముందుకు వచ్చిన దివీస్‌ లేబొరేటరీస్‌కు ఎమ్మెల్యే, సూపరింటెండెంట్‌లు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో అడ్మినిస్ట్రేటర్‌(డెప్యూటీ కలెక్టర్‌) జీవీవీ సత్యనారాయణ, అసిస్టెంట్‌ డైరెక్టర్‌(పరిపాలనా విభాగం) లక్ష్మీకుమారి, నర్సింగ్‌ సూపరింటెండెంట్‌ విజయలక్ష్మి, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

పెనమలూరుః విద్యార్థులు కళారూపాలలో ప్రావీణ్యం సాధించాలని పాఠశాల విద్యా కమిషనర్‌ వి.విజయరామరాజు అన్నారు. పోరంకిలో గురువారం రాష్ట్ర స్థాయి కళోత్సవం, సమృద్ధి ఫెస్టివల్‌ వైభవాన్ని ఆయన ప్రారంభించి ప్రసంగించారు. విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలని సూచించారు. సంగీతం, నృత్యం, చిత్రలేఖనం వంటి కళలు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయని వివరించారు. ఎస్‌సీఈఆర్‌టీ డైరెక్టర్‌ ఎంవీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ 2020 విద్యా విధానంలో భాగంగా సాధారణ విద్యతో పాటు కళా విద్యను ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. వినూత్న బోధనా పద్ధతుల ద్వారా తరగతి గదుల్లో సమృద్ధి కళారూపం ఎంతగానో మేలు చేస్తుందని అన్నారు. 12 రకాల కళారూపాల్లో 348 మంది విద్యార్థులు పోటీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ జిల్లాల నుంచి వచ్చిన విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.

పెనుగంచిప్రోలు: గ్రామంలో ఉన్న శ్రీతిరుపతమ్మ వారి మండల దీక్ష మాలధారణ కార్యక్రమం డిసెంబర్‌ 15 నుంచి ప్రారంభం అవుతుందని ఆలయ ఈఓ కిషోర్‌కుమార్‌ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమం డిసెంబర్‌ 21తో ముగుస్తుందన్నారు. వచ్చే ఏడాది జనవరి 5 నుంచి 10 వరకు అర్ధమండల దీక్ష, జనవరి 16 నుంచి 20 వరకు 11 రోజుల దీక్ష మాలధారణ కార్యక్రమం ఆలయంలో నిర్వహిస్తారని పేర్కొన్నారు.

రైల్వేస్టేషన్‌(విజయవాడపశ్చిమ): దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్‌ ఉద్యోగి జి. రాంబాబు జాతీయ పవర్‌ లిఫ్టింగ్‌ చాంపియన్‌ షిప్‌–2025 టైటిల్‌ కై వసం చేసుకున్నాడు. కర్నాటక రాష్ట్రం పవర్‌ లిఫ్టింగ్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఈ నెల 9 నుంచి 12 వరకు బెంగళూరులో జరిగిన జాతీయ పవర్‌ లిఫ్టింగ్‌ చాంపియన్‌షిప్‌లో రాజమండ్రిలో ఇంజినీరింగ్‌ విభాగంలో పనిచేస్తున్న జి.రాంబాబు అద్భుతమైన ప్రదర్శనతో మొదటిస్థానం కైవసం చేసుకున్నాడు. అతను స్క్వాట్‌–165 కిలోలు, బెంచ్‌ ప్రెస్‌–100 కిలోలు, డెడ్‌లిఫ్ట్‌–202.5 కిలోల్లో తన ప్రతిభ చాటుకుని టైటిల్‌ విన్నర్‌తో పాటుగా మాస్టర్‌ స్ట్రాంగ్‌ మ్యాన్‌ ఆఫ్‌ ఇండియా–2025 బిరుదును అందుకున్నాడు. ఈ సందర్భంగా రాంబాబు గురువారం విజయవాడ రైల్వే డీఆర్‌ఎం మోహిత్‌ సోనాకియా, ఏడీఆర్‌ఎం, ఇతర సిబ్బందిని మర్యాదపూర్వకంగా కలిశారు.

జీజీహెచ్‌లో దివీస్‌   ఆర్‌ఓ వాటర్‌ ప్లాంట్లు  
1
1/2

జీజీహెచ్‌లో దివీస్‌ ఆర్‌ఓ వాటర్‌ ప్లాంట్లు

జీజీహెచ్‌లో దివీస్‌   ఆర్‌ఓ వాటర్‌ ప్లాంట్లు  
2
2/2

జీజీహెచ్‌లో దివీస్‌ ఆర్‌ఓ వాటర్‌ ప్లాంట్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement